SNP
DC vs PBKS Prediction, IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లోని రెండో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ , పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో? ఎవరి బలం ఏంటో, ఎవరి బలహీనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
DC vs PBKS Prediction, IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌లోని రెండో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ , పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో? ఎవరి బలం ఏంటో, ఎవరి బలహీనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ అభిమానులను దాదాపు రెండున్నర నెలల పాటు వినోదాన్ని అందించే ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. ఈ సీజన్‌లోని రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనుంది. శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో గత మహారాజా యదవీంద్రసింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరి ఈ మ్యాచ్‌లో పోటీ పడుతున్న ఢిల్లీ, పంజాబ్ జట్లు ఎలా ఉన్నాయి? వాటి బలాలు ఏంటి? బలహీనతలు ఏంటి? ఎవరి ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది? మ్యాచ్ ఎవరు గెలుస్తారు? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు విశ్లేషించి తెలుసుకుందాం..
ఢిల్లీ క్యాపిటల్స్
రిషభ్ పంత్ రాకతో ఢిల్లీ క్యాపిటల్స్ బలపడిందనే చెప్పాలి. కానీ, ప్రమాదం నుంచి బయటపడి.. కోలుకుని తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్న పంత్ ఎలా ఆడతాడో చూడాలి. ఢిల్లీ టీమ్‌కు బలమైన ఓపెనింగ్ జోడీ ఉంది. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా జోడి వేగంగా ఆడి మంచి స్టార్ట్ ఇవ్వగలదు. కానీ, పృథ్వీ షా ఫామ్‌లో లేకపోవడం ఢిల్లీని కలవరపెడుతుంది. మిగతా బ్యాటింగ్ లైనప్‌లో రిషభ్ పంత్, హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్ ఉన్నారు. పేర్లు చూస్తూ.. బ్యాటింగ్ దుర్బేధ్యంగా ఉన్నా.. గ్రౌండ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే.. ఆల్‌రౌండర్లు మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ముఖేస్ కుమార్, ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జేతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ, ప్లేయింగ్ కూర్పు ఎలా ఉంటుందో చూడాలి. ఢిల్లీ బౌలింగ్‌లో కంటే బ్యాటింగ్‌లోనే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఒక్క కుల్దీప్ యాదవ్‌పైనే ఎక్కువ ఆధారపడేలా ఉన్నారు. ఇదే ఢిల్లీకి పెద్ద మైనస్.
పంజాబ్ కింగ్స్
శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ జట్టులోని ఆటగాళ్లు చూస్తే.. సూపర్ స్ట్రాంగ్‌గా కనిస్తోంది. కానీ, ప్రతి ఏడాది ఈ జట్టు పేపర్‌పై అద్భుతంగా కనిపించి.. గ్రౌండ్‌లో చేతులెత్తేస్తూ ఉంటుంది. ఈ సీజన్‌లో చూసుకుంటే.. పంజాబ్ అంటూ బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో స్ట్రాంగ్‌గా ఉంది. శిఖర్ ధావన్, ప్రభుసిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ఢిల్లీతో పోలిస్తే ఈ ఓపెనింగ్ జోడీ కాస్త వీక్‌గా ఉంది. తర్వాతి బ్యాటింగ్ లైనప్ చూస్తే.. లిమ్ లివింగ్ స్టోన్, బెయిర్ స్టో, రిలీ రోసోవ్, జితేష్ శర్మ ఉన్నారు. వీరిలో ముగ్గురు ఫారెన్ ప్లేయర్లు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒక్కరికే ప్లేయింగ్ ఉండే ఛాన్స్ ఉంది. పంజాబ్ ఆల్‌రౌండర్లలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ జట్టులో క్రిస్ వోక్స్, సామ్ కరన్, సికందర్ రజా.. ఇలా ముగ్గురు అంతర్జాతీయ స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. వీరి ముగ్గురిని ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. అర్షదీప్ సింగ్, కగిసో రబాడ, రాహుల్ చాహర్ ప్రధాన బలంగా ఉన్నారు. వీరు ముగ్గరు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండొచ్చు. పేర్లు చూసుకుంటే.. పంజాబ్ సూపర్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ఓపెనింగ్ జోడీ ఒక్కటే పంజాబ్‌కు కాస్త మైనస్‌గా కనిపిస్తోంది.
ప్రిడిక్షన్: ఇరు జట్ల బలాబలాలు పరిశీలించిన తర్వాత.. ఈ మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరిగే 16 మ్యాచ్‌ల్లో ఢిల్లీ, 16 మ్యాచ్‌ల్లో పంజాంబ్ గెలిచి సమవుజ్జీలుగా ఉన్నాయి.
ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కేఎల్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే.
పంజాబ్ కింగ్స్: ప్రభుసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైదే, లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, సికందర్ రజా, సామ్ కరన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కగిసో రబడ, రాహుల్ చాహర్.