iDreamPost
android-app
ios-app

DC vs MI: ఢిల్లీని గెలిపించింది ఫ్రేజరే కావొచ్చు.. కానీ అసలు హీరో మాత్రం అతడే!

  • Published Apr 27, 2024 | 9:02 PM Updated Updated Apr 27, 2024 | 9:02 PM

ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీని గెలిపించింది ఫ్రేజరే అయినప్పటికీ.. రియల్ హీరో మాత్రం వేరే ఉన్నాడు. అతడి అద్భుత ప్రదర్శన కారణంగానే ఢిల్లీ చిరస్మరణీయ విజయం అందుకుందని చెప్పక తప్పదు.

ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీని గెలిపించింది ఫ్రేజరే అయినప్పటికీ.. రియల్ హీరో మాత్రం వేరే ఉన్నాడు. అతడి అద్భుత ప్రదర్శన కారణంగానే ఢిల్లీ చిరస్మరణీయ విజయం అందుకుందని చెప్పక తప్పదు.

DC vs MI: ఢిల్లీని గెలిపించింది ఫ్రేజరే కావొచ్చు.. కానీ అసలు హీరో మాత్రం అతడే!

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య హోరాహోరిగా సాగిన పోరులో చివరి వరకు పోరాడి ఓడిపోయింది హార్దిక్ సేన. దీంతో 10 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం మూటగట్టుకుంది. భారీ స్కోర్లు నమోదు అయిన ఈ మ్యాచ్ లో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగారు. ఇక డీసీ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం జేక్ ఫ్రేజర్ అనే చెప్పాలి. 27 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగుల సునామీ ఇన్నింగ్స్ ఆడి టీమ్ కు భారీ స్కోర్ అందించాడు. అయితే ఈ మ్యాచ్ ను గెలిపించింది ఫ్రేజరే అయినప్పటికీ.. రియల్ హీరో మాత్రం వేరే ఉన్నాడు. అతడి అద్భుత ప్రదర్శన కారణంగానే ఢిల్లీ చిరస్మరణీయ విజయం అందుకుందని చెప్పక తప్పదు. మరి ఆ రియల్ హీరో ఎవరంటే?

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. ముంబై ముందు 258 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కొండంత టార్గెట్ తో బరిలోకి దిగిన ఎంఐకి నాలుగో ఓవర్లోనే షాక్ తగిలింది. 8 బంతుల్లో 8 పరుగులు చేసిన రోహిత్ ను ఖలీల్ అహ్మద్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్ లోనే ఇషాన్ కిషన్(20) కూడా పెవిలియన్ చేరాడు. అయితే సూర్యకుమార్(13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 26 రన్స్) జత కలిసిన తిలక్ వర్మ(63) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు.

అయితే సూర్య ఔటైన తర్వాత కెప్టెన్ పాండ్యా క్రీజ్ లోకి వచ్చి ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 రన్స్ చేసిన హార్దిక్ మంచి టచ్ లో కనిపించాడు. కానీ 13 ఓవర్ వేయడానికి వచ్చాడు రాసిక్ సలామ్. ఇతడే డీసీ విజయంలో కీలక పాత్ర పోషించిన రియల్ హీరో. ఈ ఓవర్లో పాండ్యాను, నేహాల్ వాధేరాను పెవిలియన్ కు పంపడమే కాకుండా కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అయితే ఇక్కడితో పనైపోలేదు. ఆ తర్వాత 17వ ఓవర్లో తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్లకు కట్టుదిట్టమైన బంతులు వేస్తూ.. ఈ ఓవర్లో కూడా 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో కావాల్సిన రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయి.. ముంబై బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

ఇక తన చివరి ఓవర్లో మహ్మద్ నబీ లాంటి డేంజరస్ బ్యాటర్ ను వెనక్కి పంపి.. ఈ మ్యాచ్ కు అసలైన హీరోగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసి 34 రన్స్ ఇచ్చి 3 కీలక వికెట్లు తీసుకున్నాడు రాసిక్ సలామ్. ఆ రెండు ఓవర్లు కట్టుదిట్టంగా వేయడమే కాకుండా పాండ్యా, వాధేర లాంటి ప్లేయర్లను ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. మరి డీసీ విజయంలో రియల్ హీరో రాసిక్ సలామ్ అనే మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.