Nidhan
క్రికెట్‌కు ఓ స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై చెప్పేశాడు. రెండు దేశాల తరఫున ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడతను. అలాంటోడు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు.
క్రికెట్‌కు ఓ స్టార్ ఆల్‌రౌండర్ గుడ్‌బై చెప్పేశాడు. రెండు దేశాల తరఫున ఆడుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించాడతను. అలాంటోడు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Nidhan
క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు, పోయారు. కానీ కొంతమంది మాత్రమే అద్భుతమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. అందరిలాగే వాళ్లు కూడా ఏదో ఒక రోజు గేమ్‌కు గుడ్‌బై చెప్పాల్సిందే. తాజాగా ఓ స్టార్ ఆల్‌రౌండర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. దీంతో అతడి అభిమానులు నిరాశలో మునిగిపోయారు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్. 39 ఏళ్ల వీస్ బౌలర్‌గానూ, బ్యాటర్‌గానూ తన టాలెంట్‌తో ఎంతో మంది ఆడియెన్స్ మనసుల్ని దోచుకున్నాడు. రెండు దేశాలకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. మొదట్లో సౌతాఫ్రికా తరఫున ఆడిన వీస్.. ఆ తర్వాత కొన్నాళ్లకు నమీబియాకు మారాడు.
2013లో సౌతాఫ్రికా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు వీస్. అదే జట్టుకు 2016 వరకు సేవలు అందించాడు. అనంతరం తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు అతడు వలస వెళ్లాడు. ఆ దేశ టీమ్‌కు ఆడటం మొదలుపెట్టాడు. 2021 ఆగస్ట్ నుంచి ఇప్పటిదాకా నమీబియా తరఫునే ఆడుతూ వచ్చాడు. ఇప్పటివరకు నాలుగు ప్రపంచ కప్‌లు ఆడాడతను. 2016లో ప్రొటీస్ టీమ్ తరఫున పొట్టి కప్పు బరిలో దిగిన వీస్.. 2021, 2022, 2024 ఎడిషన్స్‌లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. తన ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించాడు. రైటార్మ్ మీడియం పేసర్ అయిన అతడు 11 ఏళ్ల ఇంటర్నేషనల్ కెరీర్లో 15 వన్డేలు, 51 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 73 వికెట్లు పడగొట్టిన వీస్.. సుమారుగా 1,000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ కెరీర్‌తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్లో అతడికి ఘనమైన రికార్డులు ఉన్నాయి. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 162 లిస్ట్-ఏ మ్యాచుల్లో కలిపి దాదాపుగా 10 వేల పరుగులు చేశాడతను. అందులో 13 సెంచరీలతో పాటు 54 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఏకంగా 490 వికెట్లు పడగొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు వీస్. అతడి పేరు చెప్పగానే టీ20 ప్రపంచ కప్-2021లో నెదర్లాండ్స్‌పై గెలుపే గుర్తుకొస్తుంది. ఆ మ్యాచ్‌లో బౌలింగ్‌లో 1 వికెట్ తీసిన వీస్.. బ్యాటింగ్‌లో 40 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియాకు అదే తొలి గెలుపు కావడం విశేషం.
David Wiese – The Legend of Namibia Cricket.
– THANK YOU, DAVID WIESE..!!!! 🙌 pic.twitter.com/TiuV3d34rG
— Tanuj Singh (@ImTanujSingh) June 15, 2024