iDreamPost
android-app
ios-app

David Warner Six: డేవిడ్ భాయ్ అన్​ బిలీవబుల్ షాట్.. అలా ఎలా కొట్టావ్ సామీ!

  • Published Dec 14, 2023 | 3:18 PM Updated Updated Dec 14, 2023 | 3:18 PM

పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ శతకంతో చెలరేగాడు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇక ఈ మ్యాచ్ లో అతడు కొట్టిన ఓ సిక్స్ చూస్తే.. ఔరా అనాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారీ శతకంతో చెలరేగాడు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఇక ఈ మ్యాచ్ లో అతడు కొట్టిన ఓ సిక్స్ చూస్తే.. ఔరా అనాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

David Warner Six: డేవిడ్ భాయ్ అన్​ బిలీవబుల్ షాట్.. అలా ఎలా కొట్టావ్ సామీ!

ప్రపంచ క్రికెట్ లోకి ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ రంగప్రవేశం చేసిందో.. అప్పటి నుంచి క్రికెట్ తీరే మారిపోయింది. సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టు మ్యాచ్ లపై దీని ప్రభావం చాలా పడింది. దీంతో ఈ మ్యాచ్ లను చూసే ప్రేక్షకులు కరువైయ్యారు. కాగా.. పొట్టి ఫార్మాట్ వచ్చిన దగ్గర నుంచి బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఎంతటి కష్టమైన బంతినైనా ఈజీగా సిక్సర్లుగా, ఫోర్లుగా మలుస్తున్నారు. ఇలా ఆడే క్రమంలోనే కొన్ని అరుదైన షాట్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇక వైవిధ్యమైన బ్యాటింగ్ కు పెట్టింది పేరు డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, మాక్స్ వెల్. వీరు ఏ బాల్ ను ఎలా కొడతారో తెలుసుకోలేం. ఇక వీరి నుంచి ఎంతో మంది క్రికెటర్లు ప్రేరణ పొంది.. తికమక షాట్స్ ఆడుతున్నారు. అలాంటి ఓ అన్ బిలీవబుల్ షాట్ నే పాక్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో కొట్టాడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.

డేవిడ్ వార్నర్.. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ట్రెండింగ్ లో ఉన్నా ఆటగాడు. దానికి కారణం పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారీ శతకం సాధించడమే. ఈ మ్యాచ్ లో ఆది నుంచి పాక్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించాడు డేవిడ్ భాయ్. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళం అని చెప్పుకునే పాక్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ.. అద్భుత శతకం అందుకున్నాడు. అతడు ఈ మ్యాచ్ లో మెుత్తం 211 బాల్స్ ఎదుర్కొని 16 ఫోర్లు, 4 సిక్సర్లతో 164 పరుగులు చేశాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా గానీ.. భయపడకుండా పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇక ఈ సెంచరీతో తనపై విమర్శలు చేసిన ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ సెంచరీ తర్వాత వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకుని జాన్సన్ కు కౌంటర్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో వార్నర్ కొట్టిన తొలి సిక్స్ నభూతో నభవిష్యతి అనే చెప్పాలి. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది వేసిన ఓ ఓవర్ లో డేవిడ్ బాయ్ కొట్టిన అన్ బిలీవబుల్ షాట్ తప్పక చూడాల్సిందే. ఆఫ్ వికెట్ సైడ్ వచ్చే బంతిని అనూహ్యంగా క్రీజ్ లో కిందపడి మరీ కొట్టిన తీరు అమోఘం. అసలు అందరూ ఆ బాల్ ను ఆఫ్ సైడ్ ఆడతాడని భావించారు. కానీ వార్నర్ డిఫరెంట్ గా సిక్స్ తరలించిన విధానం చూస్తే.. ఔరా అనాల్సిందే.

ప్రస్తుతం ఈ సిక్సర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఆశ్చర్యంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటి డేవిడ్ భాయ్.. అలా ఎలా కొట్టావ్ షాట్? ఇది నీకే సాధ్యం అనుకుంటా.. అంటూ రాసుకొస్తున్నారు. ఇక తొలి ఇన్నింగ్స్ లో వార్నర్ సెంచరీతో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 75 ఓవర్లకు 5 వికట్లు నష్టపోయి 335 పరుగులు చేసింది. క్రీజ్ లో మిచెల్ మార్ష్(9), అలెక్స్ కేరీ(10) ఉన్నారు. పాక్ బౌలర్లలో అమిర్ జమాల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మరి వార్నర్ అన్ బిలీవబుల్ సిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.