iDreamPost
android-app
ios-app

David Warner: వార్నర్ భాయ్ ఇది టెస్ట్ అనుకున్నావా? వన్డే అనుకున్నావా? అలా కొడుతున్నావ్!

  • Published Dec 14, 2023 | 10:32 AM Updated Updated Dec 14, 2023 | 10:32 AM

తన చివరి టెస్ట్ సిరీస్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఆడుతుంద టెస్టా? వన్డేనా? అనే అనుమానం ఫ్యాన్స్ లో కలిగిస్తున్నాడు.

తన చివరి టెస్ట్ సిరీస్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. ఆడుతుంద టెస్టా? వన్డేనా? అనే అనుమానం ఫ్యాన్స్ లో కలిగిస్తున్నాడు.

David Warner: వార్నర్ భాయ్ ఇది టెస్ట్ అనుకున్నావా? వన్డే అనుకున్నావా? అలా కొడుతున్నావ్!

మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది పాకిస్థాన్. ఇక పాక్ ఎప్పుడైతే ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిందో అప్పటి నుంచి అడుగడుగునా అవమానాలను ఎదుర్కొంటూనే తొలి టెస్ట్ కు సిద్దమైంది. ఇప్పటికే వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ జట్టుకు తొలి టెస్ట్ లో చుక్కలు చూపిస్తున్నాడు ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. తన కెరీర్ లో చివరి టెస్ట్ సిరీస్ ఇదే అని డేవిడ్ భాయ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రెచ్చిపోయి ఆడుతున్నట్లున్నాడు వార్నర్. ఆడుతుంది టెస్టా? వన్డేనా? అన్న రీతిలో సాగింది వార్నర్ బ్యాటింగ్. ఫోర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ స్టార్ ఓపెనర్.

డేవిడ్ వార్నర్.. సమకాలీన క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఆటగాడిగా వరల్డ్ క్రికెట్ లో పేరొందాడు. ఇక తన టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతున్నానని, పాక్ తో జరిగే సిరీసే తనకు చివరిదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో పెర్త్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో రెచ్చిపోయి ఆడుతున్నాడు వార్నర్. పాక్ బౌలర్లపై ఫోర్ల దండయాత్ర చేస్తూ.. తాను ఆడుతున్నది టెస్ట్ క్రికెట్ అన్న సంగతినే మర్చిపోయాడు. ఈ మ్యాచ్ లో అతడి విధ్వంసం ఎలా సాగిందో చిన్న ఉదాహరణ చెబుతాను. ఆసీస్ జట్టు స్కోర్ మెుత్తం 74 పరుగులు ఉంటే.. అందులో వార్నర్ చేసినవే 50 రన్స్ కావడం విశేషం. కేవలం 41 బంతుల్లోనే 9 ఫోర్లతో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా రెచ్చిపోయి ఆడుతున్నాడు.

warner superb batting

కాగా.. లంచ్ సమయానికి వార్నర్ 67 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్స్ తో 72 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 37 రన్స్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం లంచ్ టైమ్ కి వికెట్ నష్టపోకుండా ఆసీస్ 25 ఓవర్లలో 117 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో వార్నర్ బ్యాటింగ్ చూసి.. డేవిడ్ భాయ్ ఇవి టెస్టులు అనుకున్నావా? లేక వన్డేలు అనుకున్నావా? అలా ఆడుతున్నావ్ అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ టెస్ట్ లో వార్నర్ తుపాన్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.