Nidhan
స్మిత్, వార్నర్.. ఇద్దరూ స్టార్ ప్లేయర్సే. ఒకే జట్టుకు చాలా ఏళ్ల నుంచి కలసి ఆడుతున్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే దాన్ని మర్చిపోయి స్లెడ్జింగ్‌కు దిగడం షాకింగ్‌గా మారింది.
స్మిత్, వార్నర్.. ఇద్దరూ స్టార్ ప్లేయర్సే. ఒకే జట్టుకు చాలా ఏళ్ల నుంచి కలసి ఆడుతున్నారు. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అయితే దాన్ని మర్చిపోయి స్లెడ్జింగ్‌కు దిగడం షాకింగ్‌గా మారింది.
Nidhan
గేమ్స్‌లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణం అనే చెప్పాలి. క్రికెట్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. స్లెడ్జింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండటం చూసే ఉంటారు. కొన్ని టీమ్స్ ఈ విషయంలో బాగా ఆరితేరాయి. అయితే స్లెడ్జింగ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆస్ట్రేలియా టీమే. ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి ప్లేయర్లను స్లెడ్జ్ చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. ఫీల్డింగ్ టైమ్‌లో అపోజిషన్ టీమ్ బ్యాటర్స్‌ను రెచ్చగొడుతూ వాళ్లను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. దీని వల్ల చాలా సార్లు ప్రత్యర్థి బ్యాటర్లు ఔటయ్యారు. అందుకే స్లెడ్జింగ్ అనేది కంగారూ టీమ్‌కు ఓ ఆనవాయితీగా మారిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా ఆ జట్టు దీన్ని అలవాటుగా మార్చుకుంది. అయితే అపోజిషన్ టీమ్స్‌ను స్లెడ్జ్ చేస్తే ఓకే.. కానీ కలసి ఆడిన సొంత జట్లు ఆటగాళ్ల మీదే స్లెడ్జింగ్‌కు దిగడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. చాలా ఏళ్ల పాటు కలసి ఆడిన వార్నర్, స్మిత్‌లు ఇప్పుడీ విషయంలో వైరల్ అవుతున్నారు.
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన ఫ్రెండ్, స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను దారుణంగా స్లెడ్జ్ చేశాడు. బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్ టీమ్స్‌కు మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. ఇందులో బ్యాటింగ్‌కు వచ్చిన సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ స్మిత్‌పై థండర్ జట్టు ఆటగాడు వార్నర్ స్లెడ్జింగ్‌కు దిగాడు. క్రీజు దగ్గర సరిగ్గా మార్క్ చేసుకోవట్లేదని టీజ్ చేశాడు. అతడి దృష్టిని ఏదీ మరల్చలేదని చెప్పాడు. స్మిత్ చాలా ఫోకస్డ్గా ఉంటాడని వ్యంగ్యంగా అన్నాడు. వార్నర్ మాటలకు అసహనానికి గురైన స్మిత్ (0) ఆడిన ఫస్ట్ బాల్కే లెగ్ సైడ్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఫీల్డర్ చేతికి చిక్కాడు. దీంతో డేవిడ్ భాయ్ సంబురాల్లో మునిగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 151 రన్స్ చేసింది.
స్టీవ్ స్మిత్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినా జోష్ ఫిలిప్ (47), జోర్డాన్ సిల్క్ (35) రాణించడంతో ప్రత్యర్థి ముందు డీసెంట్ టార్గెట్‌ను ఉంచింది. అయితే సిడ్నీ థండర్ మాత్రం 19.5 ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (37), అలెక్స్ హేల్స్ (28) తప్పితే మిగతా ఎవరూ రాణించలేదు. దీంతో 19 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. స్మిత్‌ను స్లెడ్జింగ్ చేసి సక్సెస్ అయిన వార్నర్.. టీమ్‌ను మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక, డేవిడ్ భాయ్ ఇటీవలే టెస్టులతో పాటు వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ సిరీసే అతడికి చివరిది. దీంతో టెస్టుల్లో ఓపెనింగ్ బాధ్యతలను స్టీవ్ స్మిత్‌కు అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. బిగ్‌బాష్‌లో కూడా ఓపెనర్‌గా దిగాడతను. కానీ ఆడిన తొలి బంతికే ఔటై నిరాశపర్చాడు. మొత్తానికి ఈ మ్యాచ్‌లో గెలుపోటముల కంటే కూడా స్మిత్‌ను వార్నర్ స్లెడ్జ్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ఇంతకాలం కలసి ఆడిన ప్లేయర్‌పై స్లెడ్జ్ చేయడం సరికాదని అంటున్నారు. యంగ్ క్రికెటర్స్‌కు రాంగ్ మెసేజ్ వెళ్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. స్టీవ్ స్మిత్‌ను వార్నర్ స్లెడ్జ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: హార్దిక్ వారసుడిగా తెలుగు ప్లేయర్! ఆశలు రేపుతోన్న విశాఖ ఆల్ రౌండర్..
David Warner sledges Steven Smith and Smith dismissed on a golden duck.pic.twitter.com/Gka55pHMVU
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 12, 2024