iDreamPost
android-app
ios-app

David Warner: సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న వార్నర్! నా కల అదేనంటూ..!

  • Published Jan 09, 2024 | 3:48 PM Updated Updated Jan 09, 2024 | 3:48 PM

టెస్టులతో పాటుగా వన్డేలకూ వీడ్కోలు పలికిన వార్నర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త అవతారంలో కనిపించాలని భావిస్తున్నాడట. పైగా అలా కనిపించడం తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి డేవిడ్ భాయ్ కల ఏంటో ఇప్పుడు చూద్దాం.

టెస్టులతో పాటుగా వన్డేలకూ వీడ్కోలు పలికిన వార్నర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త అవతారంలో కనిపించాలని భావిస్తున్నాడట. పైగా అలా కనిపించడం తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు. మరి డేవిడ్ భాయ్ కల ఏంటో ఇప్పుడు చూద్దాం.

David Warner: సరికొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న వార్నర్! నా కల అదేనంటూ..!

డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆస్ట్రేలియా ఓపెనర్ గా విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు వార్నర్. తాజాగా టెస్టులకు గుడ్ బై చెప్పిన డేవిడ్ భాయ్, కెరీర్ లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టులతో పాటుగా వన్డేలకూ వీడ్కోలు పలికిన వార్నర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్త అవతారంలో కనిపించాలని భావిస్తున్నాడట. ఈ విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు. అలా కనిపించాలని నా డ్రీమ్ అంటూ పేర్కొన్నాడు. అయితే ఇందులో ఓ తిరకాసు ఉందని, దానికి ఓ స్పెషల్ పర్సన్ తో మాట్లాడాలని తెలిపాడు. మరి వార్నర్ డ్రీమ్ ఏంటి? అతడు సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా కనిపించాలనుకుంటున్నాడో ఇప్పుడు చూద్దాం.

టెస్టులకు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ వార్నర్. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత వీడ్కోలు పలుకుతానని గతంలోనే ప్రకటించాడు. అందులో భాగంగానే మూడో టెస్టు తర్వాత తన టెస్ట్ కెరీర్ కు ముగింపు పలికాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టుకున్నాడు. ఆసీస్ తో పాటు పాక్ క్రికెటర్లు సైతం అతడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం టీ20ల్లో మాత్రం వార్నర్ ఆడుతున్నాడు. ఇదిలా ఉండగా.. రిటైర్మెంట్ తర్వాత తాను ఓ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని చెప్పుకొచ్చాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కోచ్ అవతారంలో కనిపించాలన్నది తన కలగా చెప్పుకొచ్చాడు. అయితే తాను కోచ్ గా మారాలనుకుంటే.. ముందుగా తన భార్య పర్మిషన్ తీసుకోవాలని తెలిపాడు. ఎందుకంటే? తాను కోచ్ గా మారితే మరికొన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. అందుకే ఆమెతో ముందుగా మాట్లాడాలన్నాడు.

that is my dream but

ఈ సందర్భంగా స్లెడ్జింగ్ పై కూడా డేవిడ్ భాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో స్లెడ్జింగ్ ఉండదని, ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన టీ20, టీ10 లాంటి లీగ్ లతో వివిధ దేశాలకు చెందిన ప్లేయర్లు డ్రస్సింగ్ రూమ్ పంచుకోవడంతో.. వారి మధ్య ఫ్రెండ్షిప్ పెరుగుతుందని వార్నర్ పేర్కొన్నాడు. దాంతో గ్రౌండ్ లో స్లెడ్జింగ్ కు తావుండదని డేవిడ్ అభిప్రాయాపడ్డాడు. ప్రస్తుతం వార్నర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుభవం ఉన్న వార్నర్ కోచ్ గా అవతారం ఎత్తితే.. జట్టుకు ఎంతో ఉపయోగం అంటూ కితాబిస్తున్నారు క్రీడా పండితులు. మరి వార్నర్ కల నెరవేరుతుందో.. లేదో వేచిచూడాలి. డేవిడ్ భాయ్ ను కోచ్ గా చూడాలని మీలో ఎంత మంది కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.