తనపై వస్తున్న ఫేక్‌ వార్తలపై ఘాటుగా స్పందించిన డేవిడ్‌ వార్నర్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి.. విశ్వవిజేతగా నిలిచి ఎంతో సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌పై కొన్ని ఫేక్‌ వార్తలు వస్తున్నాయి. అయితే.. వాటిపై స్వయంగా వార్నరే స్పందించి.. చాలా ఘాటుగా బదులివ్వడం విశేషం. మరి వార్నర్‌పై వచ్చిన ఆ ఫేక్‌ వార్తలు ఏంటి? వార్నర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి.. విశ్వవిజేతగా నిలిచి ఎంతో సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌పై కొన్ని ఫేక్‌ వార్తలు వస్తున్నాయి. అయితే.. వాటిపై స్వయంగా వార్నరే స్పందించి.. చాలా ఘాటుగా బదులివ్వడం విశేషం. మరి వార్నర్‌పై వచ్చిన ఆ ఫేక్‌ వార్తలు ఏంటి? వార్నర్‌ ఎలా రియాక్ట్‌ అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

6వ సారి వరల్డ్‌ ఛాంపియన్లుగా నిలిచి.. ఆస్ట్రేలియన్లు సూపర్‌ హ్యాపీగా ఉన్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియాపై అద్భుతం విజయం సాధించిన ఆసీస్‌ కప్పును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ తర్వాత మళ్లీ ఆసీస్‌తోనే టీ20 సిరీస్‌ ఆడనుంది భారత జట్టు. ఈ టీ20 సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా, భారత క్రికెట్‌ బోర్డులు జట్లను సైతం ప్రకటించాయి. అందుకే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులోని చాలా మంది టీ20 జట్టులోనూ ఉండటంతో వాళ్లంతా ఆస్ట్రేలియాకు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. వారిలో డేవిడ్‌ వార్నర్‌ కూడా ఉన్నాడు. అసలే ఇండియా అంటే వార్నర్‌కు అమితమైన అభిమానం. జీవితాంతం ఇక్కడే ఉండిపోమన్నా ఉండిపోతాడు. అయితే.. తాజాగా వార్నర్‌పై కొన్ని ఫేక్‌ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిపై స్వయంగా వార్నరే స్పందించాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 నెగ్గడంతో వార్నర్‌ కెరీర్‌కు మంచి ముగింపు లభించిందని, ఇక తన కెరీర్‌ ముగిసినట్లే అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. వీటి వార్నర్‌ కాస్త ఘాటుగా స్పందిస్తూ.. నేను ఫినిష్‌ అయిపోయానని మీకెవరు చెప్పారు? అంటూ ట్విట్టర్‌ వేదికగా స్పందించాడు. కాగా, వార్నర్‌కు ప్రస్తుతం 37 ఏళ్లు ఉన్నాయి. అతని వయసు రిత్యా వార్నర్‌ మరెంతో కాలం క్రికెట్‌లో కొనసాగలేడని కొంతమంది ఊహాజనితమైన విషయాలను ప్రచారం చేస్తున్నారు. అయితే.. తాను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం లేదని, తాన కెరీర్‌ ఇంకా ముగిసిపోలేదన స్వయంగా వార్నర్‌ స్పందించి స్పష్టత ఇవ్వడం గమనార్హం.

కాగా, వార్నర్‌ ఇప్పటి వరకు 109 టెస్టులు, 161 వన్డేలు, 99 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 109 టెస్టుల్లో 44.43 సగటుతో 8487 పరుగులు చేశాడు. అందులో 25 సెంచరీలు, 36 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే 161 వన్డేల్లో 45.30 సగటుతో 6932 పరుగులు చేశాడు. వన్డేల్లో 22 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక 99 టీ20ల్లో 32.88 సగటుతో 2894 పరుగులు చేశాడు. టీ20ల్లో ఒక సెంచరీ, 24 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక స్కోర్‌ 335, వన్డేల్లో 179, టీ20ల్లో 100గా ఉంది. ఇంత మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న వార్నర్‌.. కచ్చితంగా మరికొంతకాలం అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించే అవకాశం ఉంది. మరి తనపై వస్తున్న ఫేక్‌ వార్తలపై వార్నర్‌ స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments