iDreamPost
android-app
ios-app

థ్రెడ్స్ లోకి వార్నర్.. నవ్వులు పూయిస్తున్న ప్యాట్ కమ్మిన్స్, పంత్ రిప్లైలు!

  • Author Soma Sekhar Updated - 05:29 PM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Updated - 05:29 PM, Sat - 8 July 23
థ్రెడ్స్ లోకి వార్నర్.. నవ్వులు పూయిస్తున్న ప్యాట్ కమ్మిన్స్, పంత్ రిప్లైలు!

సాంకేతిక నయా విప్లవం’థ్రెడ్స్’.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వినియోగంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది డన్లౌడ్స్ ను సొంతం చేసుకుంది ఈ యాప్. మెటా సంస్థ ఈ కొత్త యాప్ ను తీసుకురావడంతో.. ట్విట్టర్ అతలాకుతలం అవుతోంది. ఇక థ్రెడ్స్ లోకి సాధరణ పౌరులతో పాటుగా.. సెలబ్రిటీలు సైతం వస్తున్నారు. ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు థ్రెడ్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యాప్ లోకి వచ్చాడు ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఆ ట్వీట్ కు నవ్వులు పూయించే రిప్లేలు ఇచ్చారు ఆసీస్ సారథి కమ్మిన్స్, టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్.

డేవిడ్ వార్నర్.. ఆసీస్ స్టార్ బ్యాటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ ద్వారా హైదరాబాదీలకు చేరువైయ్యాడు డేవిడ్ భాయ్. అదీకాక తన సోషల్ మీడియాలో తెలుగు పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. టాలీవుడ్ స్టార్స్ ను ఇమిటేట్ చేస్తూ.. తెలుగు ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ లో ఘోరంగా విఫలం అవుతున్న వార్నర్.. తాజాగా థ్రెడ్స్ లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చాడు. నేను థ్రెడ్స్ లో జాయిన్ అయ్యాను అంటూ ఆసీస్ సారథి ప్యాట్ కమ్మిన్స్ ను టాగ్ చేశాడు వార్నర్. దానికి కమ్మిన్స్ సూపర్ రిప్లై ఇచ్చాడు.

థ్రెడ్స్ లో జాయిన్ అయితే అయ్యావు కానీ.. ఇక్కడ డ్యాన్స్ వీడియోలు మాత్రం పోస్ట్ చేయకు ప్లీజ్ అంటూ కామెంట్ పెట్టాడు కమ్మిన్స్. ఇక ఈ కామెంట్ కు స్పందించాడు టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్. బెస్ట్ అడ్వైజ్ బ్రో అంటూ పంత్ రిప్లే ఇచ్చాడు. ప్రస్తుతం వీరి ట్వీట్స్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. కాగా.. డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక తెలుగు పాటలకు సైతం తన స్టెప్పులతో అదరగొడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు. అందుకే కమ్మిన్స్ ఈ సోషల్ మీడియా యాప్ లో కూడా డ్యాన్స్ వీడియోలు పెడతాడేమో అని ముందుగానే కామెంట్ చేశాడు కమ్మిన్స్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş