iDreamPost
android-app
ios-app

David Warner: కన్నీరు పెట్టుకున్న వార్నర్.. ఎప్పుడూ సరదాగా ఉండే డేవిడ్ భాయ్ ను ఇలా చూసుండరు

  • Published Jan 06, 2024 | 11:08 AM Updated Updated Jan 06, 2024 | 7:10 PM

ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండే డేవిడ్ వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యాడు.

ఎప్పుడూ సరదాగా, నవ్వుతూ ఉండే డేవిడ్ వార్నర్ కన్నీరు పెట్టుకున్నాడు. తన చివరి టెస్ట్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురైయ్యాడు.

David Warner: కన్నీరు పెట్టుకున్న వార్నర్.. ఎప్పుడూ సరదాగా ఉండే డేవిడ్ భాయ్ ను ఇలా చూసుండరు

పాకిస్తాన్ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. 3-0తో పర్యటక జట్టును మట్టికరిపించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. ఇక ఈ సిరీసే తనకు చివరి టెస్ట్ సిరీస్ అని ముందుగానే ప్రకటించాడు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. తాజాగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తుచేసింది కంగారూ టీమ్. ఇక మ్యాచ్ అనంతరం ఆటగాళ్లందరూ డేవిడ్ వార్నర్ కు ఘనమైన వీడ్కోలు అందించారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అతడి చివరి మ్యాచ్ చూడ్డానికి మైదానానికి వచ్చారు. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయ్యాడు వార్నర్.

డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ను ఆడేశాడు వార్నర్ భాయ్. తన చివరి ఇన్నింగ్స్ లో 57 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక మ్యాచ్ అనంతరం గ్యాలరీలోని ప్రేక్షకులంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. పాక్ ఆటగాళ్లు సైతం ఈ స్టార్ బ్యాటర్ కు ఘనమైన వీడ్కోలు ఇచ్చారు. బాబర్ అజం జెర్సీపై పాక్ ప్లేయర్లందరూ సైన్ చేసి బహుమతిగా వార్నర్ కు ఇచ్చారు. ఇక డేవిడ్ భాయ్ చివరి మ్యాచ్ కోసం ఫ్యామిలీ మెుత్తం గ్రౌండ్ కు వచ్చారు.

ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. వార్నర్ కన్నీరుపెట్టుకున్నాడు. తన డ్యాన్స్ స్టెప్పులతో, తెలుగు డైలాగ్స్ తో, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించేవాడు. అలాంటి వార్నర్ కన్నీరు పెట్టుకోవడంతో.. అభిమానులు కూడా భావోద్వేగానికి గురైయ్యారు. గ్రౌండ్ మెుత్తం వార్నర్.. వార్నర్ అంటూ మారుమ్రోగిపోయింది. ఇక వార్నర్ కెరీర్ విషయానికి వస్తే.. 112 టెస్టుల్లో 8786 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలతో పాటుగా 3 ద్విశతకాలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి ఎప్పుడూ సరదా సరదాగా ఉండే వార్నర్ ని ఇలా చూడలేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.