iDreamPost
android-app
ios-app

David Warner: వార్నర్ షాకింగ్ కామెంట్స్.. T20లకు కూడా వీడ్కోలు చెబుతాడా?

డేవిడ్ వార్నర్ కు క్రికెట్ ప్రపంచంలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా కాస్త కంగారు పడుతున్నారు.

డేవిడ్ వార్నర్ కు క్రికెట్ ప్రపంచంలో కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వాళ్లంతా కాస్త కంగారు పడుతున్నారు.

David Warner: వార్నర్ షాకింగ్ కామెంట్స్.. T20లకు కూడా వీడ్కోలు చెబుతాడా?

డేవిడ్ వార్నర్.. ప్రపంచ క్రికెట్ లో ఈ పేరుకు ఒక స్థానం ఉంది. ఇటీవలే వార్నర్ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. గతంలో అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు తరఫున వార్నర్ కేవలం అంతర్జాతీయ టీ20 మ్యాచులకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకిచ్చేలా వార్నర్ కొన్ని కామెంట్స్ చేశాడు. అవి చూసిన అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే డేవిడ్ వార్నర్ టీ20లకు కూడా వీడ్కోలు పలకబోతున్నాడు ఏమో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచ క్రికెట్ లో డేవిడ్ వార్నర్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫార్మాట్ ఏదైనా డేవిడ్ వార్నర్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడుతూ ఉంటాడు. ఒక టాప్ క్లాస్ ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి వార్నర్ ప్రస్తుతం వన్డే, టెస్టు క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. కేవలం టీ20ల కోసం మాత్రమే అందుబాటులో ఉంటాడు. అయితే ఇప్పుడు ఆ టీ20ల నుంచి కూడా త్వరలోనే వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అతను తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ నిర్ణయానికి వస్తున్నారు. సాధారణంగా ఎవరైనా తమ రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ఆ సమయం వచ్చినప్పుడు ప్రస్తావిస్తారు. కానీ, వార్నర్ ఇప్పుడే తాను రిటైర్ అయ్యిన తర్వాత ఏం చేయాలో భార్యతో డిస్కషన్ కూడా చేసేశాడట.

david warner retire from t20 also

డేవిడ్ వార్నర్ క్రికెట్ కు పూర్తిగా దూరమైన సందర్భంలో కోచ్ గా మారాలి అనుకుంటున్న విషయాన్ని వెల్లడించాడు. ఇప్పటికే ఈ విషయంపై తన భార్యతో చర్చించానని చెప్పాడు. కొన్నిరోజులు తనకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని కూడా చెప్పాడట. ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత డేవిడ్ వార్నర్ టీ20లకు కూడా గుడ్ బై చెప్పబోతున్నాడా? అనే అనుమానాలు ఎక్కువయ్యాయి. దగ్గర్లో ఉన్న టీ20 వరల్డ్ కప్ తర్వాత డేవిడ్ వార్నర్ టీ20లకు కూడా వీడ్కోలు చెప్పబోతున్నాడు అనే అనుమానాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి రిటైర్ అయ్యే ఉద్దేశం లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఫార్మాట్ ఏదైనా వార్నర్ మాత్రం ప్రస్తుతానికి ఎంతో ఫిట్ గా ఉన్నాడు.

ఇటీవలే తన ఆఖరి టెస్టు మ్యాచులో కూడా పాకిస్తాన్ పై తన సత్తా చాటాడు. ఒకవేళ ఫిట్ గా ఉన్న సమయంలోనే రిటైర్ అవ్వాలని డేవిడ్ భాయ్ భావిస్తున్నాడేమో అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జట్టుకు అందుబాటులో ఉన్నంతకాలం డేవిడ్ వార్నర్ ని పక్కన పెట్టి మరో యంగ్ ప్లేయర్ కి అవకాశం ఇవ్వడం చేయరు. అందుకే తన ఫిట్ నెస్, ఫామ్ పోయి.. యాజమాన్యం పక్కన పెట్టే పరిస్థితి వచ్చే కంటే ముందే వార్నర్ స్వచ్చందంగా తప్పుకోవాలని భావిస్తున్నాడేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది అధికారిక నిర్ణయం అయితే కాదు. వార్నర్ కామెంట్స్ చూసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. డేవిడ్ వార్నర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.