SNP
నా అది ఎంతో విలువైనది.. ప్లీజ్ దాన్ని తిరిగి ఇచ్చేయండి.. కావాలంటే మీకు నా బ్యాక్‌ప్యాక్ ఇస్తాను అంటూ డేవిడ్ భాయ్ ఎంతో దీనంగా తాను పొగొట్టుకున్న ఒక వస్తువు కోసం వేడుకుంటున్నాడు. మరి అదేంటో ఇప్పుదు చూద్దాం..
నా అది ఎంతో విలువైనది.. ప్లీజ్ దాన్ని తిరిగి ఇచ్చేయండి.. కావాలంటే మీకు నా బ్యాక్‌ప్యాక్ ఇస్తాను అంటూ డేవిడ్ భాయ్ ఎంతో దీనంగా తాను పొగొట్టుకున్న ఒక వస్తువు కోసం వేడుకుంటున్నాడు. మరి అదేంటో ఇప్పుదు చూద్దాం..
SNP
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సాంప్రదాయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్నర్ ప్రకటించాడు. బుధవారం నుంచి పాకిస్థాన్‌తో సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్ట్.. వార్నర్‌కు చివరి మ్యాచ్ కానుంది. టెస్టులకు వీడ్కోలు చెబుతానని గతంలోనే ప్రకటించిన వార్నర్.. తాజాగా వన్డేలకు సైతం గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. ఇలా క్రికెట్ అభిమానులకు భారీ షాకిచ్చిన డేవిడ్ భాయ్.. చివరి టెస్ట్ మ్యాచ్‌కి ముందు బాధపడుతున్నాడు. అందుకు కారణం తనకెంతో విలువైన ఒక వస్తువును వార్నర్ పొగొట్టుకున్నాడు.
చివరి టెస్ట్ ఆడేందుకు మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వార్నర్ టీమ్‌తో కలిసి ప్రయాణించాడు. ఆ క్రమంలోనే తన బ్యాక్‌ప్యాక్‌లో ఉన్న తన బ్యాగీ గ్రీన్ టెస్ట్ క్యాప్‌ను ఎవరో దొగిలించారు. సిడ్నీలో దిగిన తర్వాత అది గమనించిన వార్నర్ వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. తన క్యాప్‌ను తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అయితే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లకే కాదు.. ప్రపంచంలో చాలా మందికి టెస్ట్ క్యాప్ ఎంతో ప్రత్యేకం. కొంతమంది ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌లో వాడిన క్యాప్‌నే ఎన్ని ఏళ్లు అయినా వాడతారు.. దాన్ని ఓ సెంటిమెంట్‌లా భావిస్తారు. అందుకే వార్నర్ కూడా తన క్యాప్‌కు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నాడు. పైగా వార్నర్‌కు తన కెరీర్‌లో చివరి టెస్ట్.
మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వెళ్తున్న క్రమంలో తన లగేజ్ నుంచి బ్యాక్‌ప్యాక్ మిస్ అయిందని, ఆ క్యాప్ తనకెంతో విలువైందని, అది తిరిగి ఇస్తే సంతోషిస్తానని, నా లాస్ట్ మ్యాచ్‌లో అది ధరించి వెళ్లాలి అనుకుంటున్నట్లు వార్నర్ తెలిపాడు. అలాగే తన బ్యాక్‌పాక్ కావాలని ఎవరైనా తీసి ఉంటే.. వారికి నా దగ్గర ఉన్న ఇంకో బ్యాక్‌ప్యాక్ ఇస్తానని, కానీ, ఆ క్యాప్ మాత్రం వీలైనంత త్వరగా ఇచ్చేయాలని వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వేడుకున్నాడు.
వెంటనే వార్నర్ ప్రయాణించిన క్వాంటాస్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. వార్నర్ మీరు ప్రయాణించిన విమానంలోని మీ లగేజ్ కోసం అన్ని సీసీ కెమెరాలు పరిశీలించాం.. ఎక్కడా ఎవరూ మీ లగేజ్‌ను తెరవలేదు. అయినా కూడా ఆ క్యాప్ ఎలా పోయిందో అర్థం కావడం లేదు. ఒక వేళ మాకు తెలిస్తే.. మీ చేరాలే చేస్తాం అని పేర్కొంది. అయితే.. వార్నర్ చివరి టెస్ట్ సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. వార్నర్.. టెస్ట్ క్రికెట్ రూపురేఖల్నే మారేసిన ఆటగాడని, అతనికి మంచి ఫెర్వల్ దొరకాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మరి వార్నర్ క్యాప్ పొగొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.