iDreamPost
android-app
ios-app

World Cup: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా! టీ20 స్టైల్లో..

  • Published Oct 20, 2023 | 3:42 PM Updated Updated Oct 20, 2023 | 4:49 PM

వన్డే వరల్డ్‌ కప్ 2023లో ఆస్ట్రేలియా తొలి సారి వారి స్థాయికి తగ్గట్లు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై విరుచుకుపడుతూ.. ఆసీస్‌ ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. వన్డే కాకుండా. . టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

వన్డే వరల్డ్‌ కప్ 2023లో ఆస్ట్రేలియా తొలి సారి వారి స్థాయికి తగ్గట్లు ఆడుతున్నట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌పై విరుచుకుపడుతూ.. ఆసీస్‌ ఓపెనర్లు దుమ్మురేపుతున్నారు. వన్డే కాకుండా. . టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • Published Oct 20, 2023 | 3:42 PMUpdated Oct 20, 2023 | 4:49 PM
World Cup: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న ఆస్ట్రేలియా! టీ20 స్టైల్లో..

వన్డే వరల్డ్‌ కప్‌లో బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లో పిచ్‌లు ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటున్నాయి. దీంతో.. బ్యాటర్లు కాస్త ఏకాగ్రత పెట్టి ఆడితే.. సూపర్‌ ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. ఇప్పటికే దాదాపు 13 సెంచరీలు నమోదు అయ్యాయి ఈ టోర్నీలో. తాజగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీతో అదరగొట్టాడు. అయితే.. ఈ రోజు(శుక్రవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లోనూ.. బ్యాటర్లు పండగ చేసుకుంటున్నారు. పాపం.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ తొలుత బౌలింగ్‌ చేయాల్సి రావడం వారి దురదృష్టం ఎందుకంటే..

చాలా రోజులుగా సరైన ఇన్నింగ్స్‌లు లేక పరుగుల దాహంతో ఉన్న ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌-మిచెల్‌ మార్ష్‌.. మంచి బ్యాటింగ్‌ పిచ్‌ దొరకడంతో పాకిస్థాన్‌ బౌలర్లను చీల్చి చెండాడుతున్నారు. ఏకంగా టీ20 స్టైల్లో బ్యాటింగ్‌ చేస్తూ.. దుమ్మురేపుతున్నారు. దాదాపు 8 రన్‌రేట్‌తో ఆసీస్‌ ఓపెనర్లు స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ బ్యాటింగ్‌ చూస్తున్న క్రికెట్‌ అభిమానులు.. ఇది టీ20 వరల్డ్‌ కప్‌ కాదు స్వామి.. వన్డే వరల్డ్‌ కప్‌ అంటూ సరదాగా సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా సూపర్‌ స్టార్‌ అందుకుంది. ఓపెనర్లు వార్నర్‌-మార్ష్‌.. పాక్‌ బౌలర్లపై ఫోర్లుతో విరుచుకుపడ్డారు. ఆకలితో ఉన్న సింహాల్లా.. పాక్‌ బౌలర్లను వేటాడుతున్నారు. సరిగ్గా 38 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 2 వికెట్స్‌ కోల్పోయి.. 284 పరుగులు చేసింది. వార్నర్‌ 111 బంతుల్లో 139 చేసి క్రీజ్‌లో ఉన్నాడు. తనతో పాటు స్టీవ్‌ స్మిత్‌ 7 రన్స్‌తో నాటౌట్‌గా ఉన్నాడు. ఇక ఓపెనర్‌ మార్ష్‌ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సులతో 121 పరుగులు చేసి అఫ్రిదీ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. ఆ వెంటనే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీమ్‌లోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ను అయితే దారుణంగా కొట్టారు. అతను వేసిన 4 ఓవర్లలోనే కేవలం 59 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 14.80. ఇది టీ20 క్రికెట్‌లో కూడా అత్యంత చెత్త ఎకానమీగా పరిగణిస్తారు. మరి పాకిస్థాన్‌పై ఆసీస్‌ ఓపెనర్లు సృష్టిస్తున్న ఈ విధ​ంసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బంగ్లాదేశ్‌ ఓడినా.. ఈ బౌలర్‌ గట్స్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!