Datta Gaekwad: టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత.. ఆయన కొడుకూ క్రికెటరే!

భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన ఓ మాజీ ఆటగాడు కన్నుమూశాడు. ఆయన కొడుకు కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

భారత క్రికెట్ జట్టుకు సేవలు అందించిన ఓ మాజీ ఆటగాడు కన్నుమూశాడు. ఆయన కొడుకు కూడా టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గమనార్హం.

భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది క్రికెటర్లు సేవలు అందించారు. వారిలో కొందరు స్టార్లు, సూపర్​స్టార్లు అయ్యారు. మరికొందరు లెజెండ్స్​గా ఎప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయారు. అయితే తొలినాళ్లలో టీమిండియాను ముందుండి నడిపించిన కొందరు ప్లేయర్ల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. వీళ్లు లేకపోతే భారత జట్టు ప్రయాణం ఇక్కడి వరకు వచ్చేది కాదు. అలా మన టీమ్​కు ప్రాతినిధ్యం వహించిన తొలి తరం ఆటగాళ్లలో ఒకరు దత్తా గైక్వాడ్ (95). ఇవాళ ఉదయం బరోడాలోని స్వగృహంలో ఆయన కన్నుమూశారు. టీమిండియా తరఫున 11 టెస్టు మ్యాచులు ఆడారు గైక్వాడ్. 1952, 1959 ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు.

ఇంగ్లండ్ పర్యటనతో పాటు వెస్టిండీస్ టూర్​కు వెళ్లిన భారత టీమ్​లోనూ దత్తా గైక్వాడ్ ఉన్నారు. మంచి బ్యాటర్​గా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత కాలంలో కెప్టెన్​గానూ మారారు. పలు మ్యాచులకు సారథ్యం వహించారు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో కంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో దత్తా గైక్వాడ్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. రంజీ ట్రోఫీలో 3,139 పరుగులు చేశారాయన. ఇందులో ఏకంగా 14 సెంచరీలు ఉన్నాయి. దీన్ని బట్టి ఆయన బ్యాట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దత్తా గైక్వాడ్ వారసత్వాన్ని ఆయన కుమారుడు అన్షుమన్ గైక్వాడ్ కొనసాగించారు. అన్షుమన్ కూడా భారత్ జట్టు తరఫున క్రికెట్ ఆడారు. ఆయన టీమిండియా తరఫున 40 టెస్టులు ఆడి 1,985 పరుగులు చేశారు. అలాగే 15 వన్డేలు ఆడి 269 పరుగులు చేశారు. కాగా, భారత్​కు ఆడి బతికున్న వారిలో ఓల్డెస్ట్ క్రికెటర్​గా పేరు తెచ్చుకున్న దత్తా గైక్వాడ్ మరణం అభిమానులను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

ఇదీ చదవండి: పుజారా ఫ్యూచర్​పై అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. ఇంత మాట అనేశాడేంటి!

Show comments