ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. వారు తమదైన బ్యాటింగ్ తో, బౌలింగ్ తో వరల్డ్ క్రికెట్ పై చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎంతటి దిగ్గజ బ్యాటర్ కైనా ఓ స్టార్ బౌలర్ ను ఎదుర్కొవడం కష్టమే. ఇదే విషయాన్ని ఎంతో మంది లెజెండరీలు భయటపెట్టారు కూడా. ఇక ఎంతటి ఘనాపాటి బౌలర్ కైనా.. ఓ స్టార్ బ్యాటర్ కి బౌలింగ్ చేయాలంటే భయమే. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికా స్పిడ్ గన్, మాజీ బౌలర్ డేల్ స్టెయిన్. ఆ టీమిండియా స్టార్ బ్యాటర్ కు బౌలింగ్ చేయాలంటే నాకు భయంగా ఉండేదని స్టెయిన్ తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో చెప్పుకొచ్చాడు.
డేల్ స్టెయిన్.. సౌతాఫ్రికా స్పీడ్ గన్ గా, వరల్డ్ క్రికెట్ పై చెరగని ముద్ర వేశాడు. గంటకు 140 కి.మీ వేగంతో బంతులు లైన్ అండ్ లెంగ్త్ లో సంధించడంలో స్టెయిన్ సిద్దహస్తుడు. ఇతడి బౌలింగ్ ఆడాలంటేనే స్టార్ బ్యాటర్లకు సైతం వణుకు పుట్టేదంటే అతిశయోక్తికాదు. మరి ఇలాంటి బౌలర్ నే భయపెట్టాడు టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ. తాజాగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన సౌతాఫ్రికా స్పీడ్ స్టర్ స్టెయిన్.. రోహిత్ శర్మను ప్రశంసల్లో ముంచెత్తాడు. “రోహిత్ శర్మకు బౌలింగ్ చేయాలంటే నాకు భయంగా ఉండేది. అతడు అద్భుతమైన ఆటగాడే కాకుండా అంతకంటే అద్భుతమైన సారథి. అతడికి బౌలింగ్ చేయాలంటే నాకు దడపుట్టేది” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు స్టెయిన్.
ఇదిలా ఉంటే.. గతంలో రోహిత్ శర్మ కూడా స్టెయిన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను ఎదుర్కొన్న బౌలర్లలో స్టెయిన్ అత్యంత కఠినమైన బౌలర్ అని, అతడు తన క్లాసిక్ బౌలింగ్ తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని, గంటకు 140 కి.మీ వేగంలో కూడా స్వింగ్ చేయడం అతడి నైజం అని కితాబిచ్చాడు రోహిత్. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dale Steyn said “I always struggled to bowl against Rohit, he is a phenomenal batter, leading the team from the front”. [Star Sports] pic.twitter.com/KorxGTZbLh
— Johns. (@CricCrazyJohns) September 30, 2023