IPL 2024: SRHపై ఆర్సీబీ గెలుపు..CSK ఫుల్ హ్యాపీ! కారణం తెలిస్తే అబ్బా.. అనాల్సిందే!

తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ పై ఆర్సీబీ గెలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. అదేంటి? అనుకుంటున్నారా? పదండి మరి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ పై ఆర్సీబీ గెలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. అదేంటి? అనుకుంటున్నారా? పదండి మరి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థులకు చలి జ్వరం పుట్టిస్తూ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ, దూసుకెళ్తోంది. అలాంటి జట్టుతో హోం గ్రౌండ్ లో ఆడాలంటే.. ఏ టీమ్ కైనా భయమే. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. గురువారం జరిగిన మ్యాచ్ లో 35 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ను చిత్తు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. ఆరు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అయితే ఆర్సీబీ గెలిస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ హ్యాపీగా ఉంది. అదేంటి? అనుకుంటున్నారా? పదండి మరి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

ఈ మ్యాచ్ కు ముందు ఆర్సీబీ చిన్నస్వామి వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో SRH బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలోనే 287 పరుగుల రికార్డు స్కోర్ ను సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆ మ్యాచ్ లో ఆర్సీబీ పోరాడి ఓడిపోయింది. దీంతో తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మరెన్నో రికార్డులు బద్దలు అవుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా బెంగళూరు టీమ్ 35 రన్స్ తో హైదరాబాద్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఆర్సీబీ గెలుపుతో ఆ టీమ్ కంటే ఎక్కువ సంతోషంగా ఉంది చెన్నై సూపర్ కింగ్స్. దానికి కారణం ఏంటంటే?

ఈ ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్థి బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడుతున్నారు సన్ రైజర్స్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, హన్రిచ్ క్లాసెన్. అయితే వీరిద్దరి బలహీనతను పసిగట్టిన ఆర్సీబీ.. మాస్టర్ ప్లాన్ వేసి వారిని ఉచ్చులో పడేసింది. స్పిన్ ను ఎదుర్కొవడంతో హెడ్ వీక్ అని కనిపెట్టి.. తొలి ఓవర్ ను విల్ జాక్స్ తో వేయించారు. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో మూడు బంతులు ఎదుర్కొన్న హెడ్ కేవలం ఒక్క రన్ మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక క్లాసెన్ కూడా స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.

కాగా.. స్పిన్ ఆడటంలో హెడ్ బలహీనతను వెలుగులోకి తెచ్చి మిగతా జట్లకు ఆర్సీబీ ఓ దారి చూపింది. దీంతో ఆదివారం చెపాక్ వేదికగా సన్ రైజర్స్ తో జరగబోయే మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్పిన్ ను ఆయుధంగా ఉపయోగించాలని భావిస్తోంది. తీక్షణ, జడేజా, మెుయిన్ అలీలతో ఎటాక్ చేయాలని చూస్తోంది. కాగా.. హెడ్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్ ల్లో 46 సగటుతో 325 రన్స్ చేశాడు. అయితే ఇందులో స్పిన్ బౌలింగ్ లో కేవలం 63 రన్స్ మాత్రమే చేశాడు. అదే ఫాస్ట్ బౌలింగ్ లో 262 పరుగులు చేసి సత్తాచాటుతున్నాడు. మరి హెడ్ స్పిన్ బలహీనతపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments