iDreamPost

SRHపై గెలవగానే.. RCB ఫ్యాన్స్‌ కొత్త డిమాండ్‌! IPL ఫైనల్‌ మ్యాచ్‌ డేట్‌ మార్చాలంటూ రచ్చ

  • Published Apr 26, 2024 | 1:17 PMUpdated Apr 26, 2024 | 1:17 PM

RCB, Virat Kohli, SRH vs RCB: సన్‌రైజర్స్‌పై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్‌ సంతోషానికి హద్దేలేకుండా పోయింది. అ క్రమంలోనే వాళ్లు ఒక డిమాండ్‌ను ముందు తెచ్చారు. ఐపీఎల్‌ ఫైనల్‌ డేట్‌ను మార్చాలని కోరుతున్నారు. ఎందుకో ఏంటో ఇప్పుడు చూద్దాం..

RCB, Virat Kohli, SRH vs RCB: సన్‌రైజర్స్‌పై గెలిచిన తర్వాత ఆర్సీబీ ఫ్యాన్స్‌ సంతోషానికి హద్దేలేకుండా పోయింది. అ క్రమంలోనే వాళ్లు ఒక డిమాండ్‌ను ముందు తెచ్చారు. ఐపీఎల్‌ ఫైనల్‌ డేట్‌ను మార్చాలని కోరుతున్నారు. ఎందుకో ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 26, 2024 | 1:17 PMUpdated Apr 26, 2024 | 1:17 PM
SRHపై గెలవగానే.. RCB ఫ్యాన్స్‌ కొత్త డిమాండ్‌! IPL ఫైనల్‌ మ్యాచ్‌ డేట్‌ మార్చాలంటూ రచ్చ

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు రెండో విజయం దక్కింది. అప్పుడెప్పుడో.. గత నెల ఐపీఎల్‌ స్టార్టింగ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఒక మ్యాచ్‌ నెగ్గిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత.. మళ్లీ ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. గురువారం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 35 రన్స్‌ తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఈ గెలుపు తర్వాత ఆర్సీబీ అభిమానుల్లో ఆత్మవిశ్వాసం భారీగా పెరిగినట్లు కనిపిస్తోంది. 9 మ్యాచ్‌ల్లో రెండో విజయం రావడంతో.. ఏకంగా ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ డేట్‌ను మార్చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అది ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సన్‌రైజర్స్‌పై విజయంతో ఆర్సీబీకి ఇంకా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో కూడా ఆర్సీబీ భారీ తేడాతో గెలిచి, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌ 3లో ఉన్న మూడు టీమ్స్‌ ఎక్కువ విజయాలు సాధిస్తే.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే ఛాన్స్‌ ఉంది. కాగా, ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మే 26న చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. అయితే.. ఈ డేట్‌లో మార్పు చేసి, మే 26న కాకుండా మే 25న నిర్వహించాలని ఆర్సీబీ అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అసలు ఫైనల్‌ డేట్‌తో వాళ్లకు ఏం సంబంధం​, మార్చమని వాళ్లేందుకు డిమాండ్‌ చేస్తున్నారు? అని కంగారు పడుతున్నారా? దానికి ఒక లాజిక్‌ ఉంది. అదేంటంటే.. ఎస్‌ఆర్‌హెచ్‌పై ఆర్సీబీ ఆడిన తీరు చూసి.. ఆర్సీబీ అభిమానులకు తమ టీమ్‌పై పిచ్చ కాన్ఫిడెన్స్‌ వచ్చేసింది.

మిగిలిన ఐదు మ్యాచ్‌లు గెలిచేసి.. ఫ్లే ఆఫ్స్‌లోనూ సత్తా చాటేసి.. ఏకంగా ఫైనల్‌కు ఆర్సీబీ దూసుకెళ్తుందని ధీమాగా ఉన్నారు. ఒక వేళ అదే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఫైనల్‌ మ్యాచ్‌ 26న కాకుండా 25 నిర్వహించాలని అంటున్నారు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన విజయం తెలిసిందే. ఒకటి మార్చి 25న పంజాబ్‌పై, రెండోది ఏప్రిల్‌ 25న సన్‌రైజర్స్‌పై.. అంటే 25వ తేదీ ఆర్సీబీకి బాగా కలిసి వస్తుందని, అందుకే ఫైనల్‌ మ్యాచ్‌ కూడా మే 25న నిర్వహిస్తే.. కచ్చితంగా ఆర్సీబీ కప్పు కొడుతుందని ఆర్సీబీ ఫ్యాన్స్‌ బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఈ డిమాండ్‌ సోషల్‌ మీడియాలో వినిపిస్తుంది. అయితే.. దీనిపై భారీ స్థాయిలో జోకులు పేలుతున్నాయి. మరి ఫైనల్‌ మ్యాచ్‌ డేట్‌ మార్చాలని ఆర్సీబీ ఫ్యాన్స్‌ చేస్తున్న డిమాండ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి