iDreamPost
android-app
ios-app

IPL 2024లో CSK చెత్త రికార్డ్.. మరీ ఇంత దారుణంగానా? ఇది అస్సలు ఊహించలేరు..

  • Published May 12, 2024 | 4:48 PM Updated Updated May 12, 2024 | 4:48 PM

ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకుంది. CSK పేరిట ఇలాంటి ఓ రికార్డ్ ఉంటుందని ఫ్యాన్స్ అస్సలు ఊహించి ఉండరు. ఇంతకీ ఆ వరస్ట్ రికార్డ్ ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకుంది. CSK పేరిట ఇలాంటి ఓ రికార్డ్ ఉంటుందని ఫ్యాన్స్ అస్సలు ఊహించి ఉండరు. ఇంతకీ ఆ వరస్ట్ రికార్డ్ ఏంటంటే?

IPL 2024లో CSK చెత్త రికార్డ్.. మరీ ఇంత దారుణంగానా? ఇది అస్సలు ఊహించలేరు..

ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు అవుతూ ఉన్నాయి. అయితే అందులో ఘనమైన ఘనతలతో పాటుగా చెత్త రికార్డులు కూడా ఉన్నాయి. భారీ రికార్డులు క్రియేట్ చేసిన మేటి జట్లు సైతం తమ పేరిట కొన్ని వరస్ట్ గణాంకాలను కూడా నమోదు చేసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2024 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ చెత్త రికార్డ్ ను తన పేరిట లిఖించుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానల్లో ఉన్న పంజాబ్ ఈ విషయంలో చెన్నై కంటే ముందుంది. మరి ఆ వరస్ట్ రికార్డ్ ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఐపీఎల్ సీజన్ లో నిలకడగా రాణించి.. ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ గెలిస్తేనే చెన్నై ఈ టోర్నీలో ముందుకుసాగేందుకు ఛాన్స్ లు ఉన్నాయి. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ ల్లో సగం గెలిచి, సగం ఓడిపోయింది. ప్రస్తుతం 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ పరమ చెత్త రికార్డ్ ను తనపేరిట లిఖించుకుంది. అదేంటంటే? ఈ ఐపీఎల్ సీజన్ లో పవర్ల ప్లేలో అత్యంత తక్కువ సిక్సులు కొట్టిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు పవర్ ప్లేలో సీఎస్కే కేవలం 15 సిక్సులు మాత్రమే కొట్టి అతి తక్కువ సిక్సులు కొట్టిన జట్టుగా నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో రాజస్తాన్, గుజరాత్ చెరో 16 సిక్సులు లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ 19, లక్నో 21 సిక్సులతో తర్వాత ప్లేసుల్లో ఉన్నాయి. మరి ఎవ్వరూ ఊహించని వరస్ట్ రికార్డ్ ను తన పేరిట లిఖించుకున్న చెన్నైపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.