iDreamPost

MS Dhoni: IPL 2025లో ధోని ఆడతాడా? సీఎస్కే CEO ఆన్సర్ ఇదే!

ధోని వీడ్కోలు కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ధోని ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా? లేదా? పూర్తి వివరాల్లోకి వెళితే..

ధోని వీడ్కోలు కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ధోని ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా? లేదా? పూర్తి వివరాల్లోకి వెళితే..

MS Dhoni: IPL 2025లో ధోని ఆడతాడా? సీఎస్కే CEO ఆన్సర్ ఇదే!

మహేంద్రసింగ్ ధోని.. ఈ ఐపీఎల్ సీజన్ తోనే తన కెరీర్ ముగిస్తాడని అందరూ భావించారు. కానీ ఇప్పటి వరకు ధోని తన నిర్ణయాన్ని ఎక్కడా ప్రకటించలేదు. అయితే తొడ కండరాల చికిత్స కోసం లండన్ వెళ్తున్నట్లు, అక్కడ సర్జరీ చేయించుకోనున్నట్లు సీఎస్కే వర్గాలు ప్రకటించాయి. సర్జరీ తర్వాత గాయం నుంచి కోలుకోవడానికి 5-6 నెలలు పడుతుందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ తెలిపిన విషయం తెలిసిందే. తాాజాగా ధోని వీడ్కోలు కు సంబంధించి సీఈవో కాశీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ఐపీఎల్ 2025లో మహేంద్రసింగ్ ధోని ఆడతాడా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఫ్యాన్స్ తో పాటుగా క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ విషయానికి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. “ధోని ఐపీఎల్ 2025లో ఆడాతాడా? అన్న దానిపై మాకు క్లారిటీ లేదు. ఆ విషయం ధోనికే తెలియాలి. అతడు ఏ నిర్ణయం తీసుకున్నా మేం గౌరవిస్తాం. ఇక ధోని ఏ నిర్ణయం తీసుకున్నా.. సరైన సమయానికే వెళ్లడిస్తాడని మనందరికీ తెలుసు. నేను కూడా మీలాగే మిస్టర్ కూల్ మరో ఐపీఎల్ సీజన్ ఆడాలని ఆశగా ఎదురుచూస్తున్నాను” అంటూ ధోని రిటైర్మెంట్ పై తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ఒకవేళ ధోని రిటైర్మెంట్ ప్రకటించే వాడే అయితే.. ఇప్పటికే తన నిర్ణయాన్ని వెల్లడించేవాడని ఫ్యాన్స్, అభిమానులు అంటున్నారు. కాగా.. ప్రస్తుతం ధోని తన తొడకండరాల గాయానికి సర్జరీ చేయించుకునేందుకు లండన్ వెళ్లనున్నాడు. 5 నుంచి 6 నెలలు విశ్రాంతి తీసుకున్న తర్వాత తన భవిష్యత్ పై ధోని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 42 ఏళ్ల ధోని నెక్ట్స్ ఐపీఎల్ సీజన్ ఆడటం అనుమానమే అని మరికొంత మంది అంటున్నారు. మరి ధోని నెక్ట్స్ ఐపీఎల్ ఆడతాడా? ఆడడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి