Krishna Kowshik
ఈ ఫోటోలోని పిల్లాడు.. క్రికెట్ రంగాన్ని తన ఆట తీరుతో శాసించాడు. టీమిండియా చరిత్రను తిరగరాసిన క్రీడాకారుడిగా మారాడు. అతడి కెప్టెన్సీలో ఎన్నో విజయాలు. ఇంతకు ఆ బాలుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.
ఈ ఫోటోలోని పిల్లాడు.. క్రికెట్ రంగాన్ని తన ఆట తీరుతో శాసించాడు. టీమిండియా చరిత్రను తిరగరాసిన క్రీడాకారుడిగా మారాడు. అతడి కెప్టెన్సీలో ఎన్నో విజయాలు. ఇంతకు ఆ బాలుడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.
Krishna Kowshik
తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలదించందని సామెత ఉంది. జీవితంలో ఏమీ అవుతావురా అని చిన్నప్పుడు పిల్లల్ని అడిగితే.. ఖచ్చితంగా టీచర్, పోలీస్ ఆఫీసర్, కలెక్టర్ అవుతామని చెబుతుంటారు. కానీ తీరా చదువులు పూర్తయ్యాక.. ఒకటి అనుకుంటే.. మరొటి చేస్తూ ఉంటారు. అప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు.. త్వరగా సెటిల్ అయ్యే సాఫ్ట్ వేర్ లేదా బిజినెస్, ఇతర రంగాల్లో కొనసాగుతుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కొనసాగుతుంటారు. దీని కోసం చిన్నప్పటి నుండే కసరత్తులు చేస్తుంటారు. అయితే ఆటలు, పాటలు కూడు పెడతాయా అని తల్లిదండ్రులు మందలిస్తే.. మధ్యలో డ్రాప్ అయ్యేవారు కొందరైతే.. అతి కొద్ది మంది మాత్రమే ఆటల్లో రాణిస్తూ.. చరిత్ర సృష్టిస్తుంటారు.
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు కూడా క్రీడారంగంలోని ఓ ఆటను తన గేమ్‌తో శాసించాడు. తిరుగులేని ప్లేయర్ అయ్యాడు. ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు కానీ మరో రంగంలో రాణించాడు. యువ క్రీడాకారులకు అతడో గురువు, మెంటర్. ఎంతో మంది దిగ్గజ క్రీడాకారులు సైతం.. అతడి ఆట తీరుకు ఫిదా అయిపోయారు. ఇంతకు ఆ బాలుడు ఎవరంటే.. ప్రముఖ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. టీమిండియా చరిత్రను తిరగరాసిన క్రీడాకారుడిగా మారాడు. బీహార్ రాష్ట్రంలోని రాంచీలో (ఇప్పుడది జార్ఖండ్) 1981లో జులై 7వ తేదీన 1 పుట్టిన ధోనీ.. ఇప్పుడు సచిన్ టెండ్కూలర్ తర్వాత అంతటి స్టార్ క్రికెటర్‌గా అవతరించాడు. క్రికెట్ రంగంలో దిగ్గజ క్రీడాకారుడిగా మారాడు. అతడు క్రీజులోకి దిగుతున్నాడంటే.. ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. సిక్సులు, ఫోర్స్ అతడికి సలామ్ కొట్టి గులామ్ కావాల్సిందే.
1983 తర్వాత ఇండియాకు ప్రపంచ కప్ అందించిన ఘనత కేవలం ధోనీకే దక్కింది. కపిల్ దేవ్ తర్వాత.. ట్రోఫీని అందించి భారతీయ క్రీడాభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. తొలి మ్యాచే డక్ అవుట్. కానీ జీరో నుండి హీరో అయ్యాడు ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్. అతడు గ్రౌండ్‌లో అడుగుపెడుతుంటేనే..ధోనీ ధోనీ అన్న అరుపులతో ఆ స్టేడియమంతా మార్మోగిపోతుంది. ఇక ఓటమి వచ్చినా, గెలుపు వచ్చినా, పొగడ్తలు, తిగడ్తలు వచ్చినా ఓకేలా ఉండటం అతడి నైజం. అందుకే మిస్టర్ కూల్ అన్న పేరు వచ్చింది. ఇక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. 2011లో వరల్డ్ కప్.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని తన సారధ్యంలో ఇండియాకు బహుమతిగా ఇచ్చాడు. ఆ దశాబ్దం క్రికెట్ రంగంలో ఓ గోల్డ్ ఏరాగా మిగిలిపోయింది. 2019లో వన్డే, ఇటు టీ 20లకు గుడ్ బై చెప్పిన ధోనీ.. ఇప్పుడు ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదు సార్లు విజేతగా నిలబెట్టిన ఘనుడు మహేంద్ర సింగ్ ధోనీ. క్రీడా రంగంలో అతడు అందించిన సేవలకు గాను.. పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను పొందాడు ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్.