ఆస్ట్రేలియాతో 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఆ గడ్డపై అడుగుపెట్టిన పాక్ జట్టుకు అడుగడుగునా అవమానాలే ఎదురౌతున్నాయి. తొలి రోజే తమ లగేజీలు మోసుకుని కూలీలుగా మారిన పాక్ ఆటగాళ్లకు మరో ఘోర అవమనాం జరిగింది.
ఆస్ట్రేలియాతో 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఆ గడ్డపై అడుగుపెట్టిన పాక్ జట్టుకు అడుగడుగునా అవమానాలే ఎదురౌతున్నాయి. తొలి రోజే తమ లగేజీలు మోసుకుని కూలీలుగా మారిన పాక్ ఆటగాళ్లకు మరో ఘోర అవమనాం జరిగింది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ విమర్శలతోనూ, వివాదాల తోనూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే పరువుపోగొట్టుకుని న్యూస్ లో నిలిచిన సందర్భాలే ఎక్కువని ఇక్కడ చెప్పుకోవాలి. వన్డే ప్రపంచ కప్ లో దారుణ ప్రదర్శనతో పాక్ ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో వరల్డ్ వైడ్ గా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక ఈ మెగాటోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. 3 మ్యాచ్ ల సిరీస్ కోసం ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టింది పాక్ జట్టు. డిసెంబర్ 14 నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఆసీస్ ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ టీమ్ తో వార్మప్ మ్యాచ్ ఆడింది పాక్. ఈ సందర్భంగా పాక్ కు ఘోర అవమానం జరిగింది.
ఆస్ట్రేలియాతో 3 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం ఆ గడ్డపై అడుగుపెట్టింది పాక్. వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యం తర్వాత పాక్ ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో.. ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇదిలా ఉండగా అసలైన పోరుకు ముందు పాక్ వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ జట్టుతో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో పాల్గొంది దాయాది దేశం. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ కు ఘోర అవమానం ఎదురైంది. అసలు విషయం ఏంటంటే? ఇంటర్నేషనల్ క్రికెట్ అయినా, వార్మప్ మ్యాచ్ లు అయినా టీవీల్లో లైవ్ ప్రసారం చేస్తుంటారు. ఇక ఆ సమయంలో టీవీ తెరలపై స్కోర్ బోర్డ్ కనిపించేలా బోర్డ్ లను ఏర్పాటు చేయడం మనకు తెలిసిన విషయమే.
ఈ క్రమంలోనే మ్యాచ్ జరుగుతుండగా.. టీవీ స్క్రీన్ కింది భాగంలో ఇరు జట్ల పేర్లను షార్ట్ కట్ లో చూపించే టిక్కర్ వస్తుంటుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పాక్ ను షార్ట్ కట్ లో PAK అనే ఇంగ్లీష్ పదంతో సూచిస్తారు. కానీ ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో PAKకి బదులుగా బోర్డ్ పై PAKI అని పడింది. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. పాక్ పేరు తప్పు రావడం గమనించిన ఆసీస్ రిపోర్టర్ ఒకరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది నెట్టింట్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఎందుకంటే పాకిస్థాన్ లేదా దక్షిణాసియా దేశాలను ఇంగ్లాండ్ లో పాకీ అని పిలుస్తుంటారు.
ఈ విషయంపై విమర్శలు రావడంతో.. మ్యాచ్ ప్రసార కర్త ఫాక్స్ న్యూస్ స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగానే ఇది జరిగిందని చెప్పుకొచ్చింది. ఇక ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు చెప్పింది. ఇదిలా ఉండగా.. పాక్ జట్టు ఆసీస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఘోర అవమానాలు ఎదుర్కొంటూనే ఉంది. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన పాక్ కు సరైన స్వాగతం లభించకపోవడంతో పాటుగా తమ లగేజీలను పాక్ క్రికెటర్లే మోసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి పాక్ కు ఘోర అవమానం జరిగింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fox Cricket broadcast PAK vs AUS warm up game and the scorecard registered PAK name as “Paki” which is the term associated with Racism.
Journalist Saeed noticed and gives the statement.– CA gives apologize now. pic.twitter.com/iK5RUnHaLU
— Jaya Suriyan (@_jayasuriyan_) December 8, 2023