Rohit Sharma: రోహిత్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా! ఇంటికి పంపాడనే కోపమా?

Rohit Sharma: రోహిత్‌ను దారుణంగా అవమానించిన ఆస్ట్రేలియా! ఇంటికి పంపాడనే కోపమా?

Rohit Sharma, Cricket Australia, T20 World Cup 2024, Rashid Khan: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌కి ముందు రోహిత్‌ శర్మను క్రికెట్‌ ఆస్ట్రేలియా దారుణంగా అవమానించింది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rohit Sharma, Cricket Australia, T20 World Cup 2024, Rashid Khan: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌కి ముందు రోహిత్‌ శర్మను క్రికెట్‌ ఆస్ట్రేలియా దారుణంగా అవమానించింది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ప్రపంచం మొత్తం ప్రశంసిస్తున్న సమయంలో ఆస్ట్రేలియా కావాలానే పనిగట్టకుని అవమానించినట్లు విమర్శలు వస్తున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌కు సిద్ధం అవుతున్న తరుణంలో.. వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి సూపర్‌ 8లో ఇంటి బాట పట్టిన కంగారులు తమ కడుపు మంటను బయటపెట్టారు. టీమిండియా చేతిలో సూపర్‌ 8 చివరి మ్యాచ్‌లో ఓటమితో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే.. తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా బెస్ట్‌ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటించింది.

ఆ జట్టుకు రషీద్‌ ఖాన్‌ను కెప్టెన్‌గా పేర్కొంది. టీమిండియాను అద్భుతంగా నడిస్తూ.. ఫైనల్‌ వరకు తీసుకొచ్చిన రోహిత్‌ శర్మను కాదని, సెమీస్‌తోనే ఇంటి బాట పట్టిన ఆఫ్ఘాన్‌ జట్టు కెప్టెన్‌ను బెస్ట్‌ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌కు సారథిగా నియమించింది. ఆస్ట్రేలియా ప్రకటించిన ఈ టీమ్‌పై ఎవరికీ ఎలాంటి కంప్లైయింట్స్‌ లేకపోయినా.. కెప్టెన్‌ విషయంలోనే రోహిత్‌ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. క్రికెట్‌ ఆస్ట్రేలియా కావాలనే రోహిత్‌ శర్మను కాకుండా రషీద్‌ను కెప్టెన్‌గా పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి తాము నిష్క్రమించడానికి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మనే కారణం అనే కోసం ఆస్ట్రేలియాలో ఉందని, అందుకే ఫైనల్‌ ముందు రోహిత్‌ను డిస్టబ్‌ చేసేందుకే ఈ టీమ్‌ను ప్రకటించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే.. ఓపెనర్‌గా మాత్రం రోహిత్‌నే పేర్కొంది ఆస్ట్రేలియా. ఇంతకీ ఆస్ట్రేలియా ప్రకటించిన టీమ్‌ ఆఫ్‌ ది టీ20 వరల్డ్‌ కప్‌ను ఒక సారి చూస్తే.. రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, నికోలస్ పూరన్, ఆరోన్ జోన్స్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్ (కెప్టెన్‌), రిషద్ హొస్సేన్, అన్రిచ్ నోర్ట్జే, జస్ప్రీత్ బుమ్రా, ఫజల్హాక్ ఫరూకీలు ఉన్నారు. మరి ఈ టీమ్‌పై అలాగే రోహిత్‌ను కెప్టెన్‌గా పేర్కొనకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments