iDreamPost
android-app
ios-app

కప్పు అడుగుదూరంలో SRH.. లాజిక్‌ రిపీట్‌ అయితే కప్పు మనదే!

  • Published May 25, 2024 | 11:20 AMUpdated May 25, 2024 | 11:20 AM

SRH, Deccan Chargers, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌దే కప్పు అనేలా ఒక క్రేజీ సెంటిమెంట్‌ ఊరిస్తోంది. మరి ఆ సెంటిమెంట్‌ ఏంటి దాని కథేంటి ఇప్పుడు చూద్దాం..

SRH, Deccan Chargers, IPL 2024: ఐపీఎల్‌ 2024లో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌దే కప్పు అనేలా ఒక క్రేజీ సెంటిమెంట్‌ ఊరిస్తోంది. మరి ఆ సెంటిమెంట్‌ ఏంటి దాని కథేంటి ఇప్పుడు చూద్దాం..

  • Published May 25, 2024 | 11:20 AMUpdated May 25, 2024 | 11:20 AM
కప్పు అడుగుదూరంలో SRH.. లాజిక్‌ రిపీట్‌ అయితే కప్పు మనదే!

క్వాలిఫైయర్‌-2లో రాజస్థాన్‌ రాయల్స్‌పై అద్భుత విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఐపీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైలోని చిదంబరం క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 36 పరుగుల తేడాతో ఆర్‌ఆర్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌, రాహుల్‌ త్రిపాఠి, హెన్రిచ్‌ క్లాసెన్‌ రాణించడంతో పాటు.. బౌలింగ్‌లో షాబాద్‌ అహ్మద్‌, అభిషేక్‌ చెలరేగడం, నటరాజన్‌, కమిన్స్‌ కట్టుదిట్టగా బౌలింగ్‌ చేయడంతో రాజస్థాన్‌ రాయల్స్‌ చిత్తుగా ఓటమి పాలైంది. అయితే.. సన్‌రైజర్స్‌ ఫైనల్స్‌కు చేరడంతో ఒక సూపర్‌ సెంటిమెంట్‌ వెలుగులోకి వచ్చింది. అదే కనుక రిపీట్‌ అయితే.. రాసిపెట్టుకోండి.. సారి కప్పు కొట్టేది ఎస్‌ఆర్‌హెచ్‌ అంటున్నారు అభిమానులు. మరి ఆ సెంటి మెంట్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కంటే ముందు.. ఐపీఎల్‌లో మన హోం టీమ్‌గా డెక్కన్‌ ఛార్జర్స్‌ ఉండేది. వీవీఎస్‌ లక్ష్మన్‌, గిల్‌క్రిస్ట్‌, ఆండ్రూ సైమండ్స్‌, షాహిద్‌ అఫ్రిదీ, హర్షల్‌ గిబ్స్‌.. ఇలా స్టార్‌ క్రికెటర్లతో కళకళలాడిపోయేది డెక్కన్‌ ఛార్జర్స్‌ టీమ్‌. కానీ, తొలి సీజన్‌ అంటే.. 2008లో మాత్రం డెక్కన్‌ ఛార్జర్స్‌ దారుణంగా విఫలమైంది. చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కానీ, నెక్ట్స్‌ ఇయర్‌కి కొత్త జెర్సీ, కొత్త లోగో, కొత్త కెప్టెన్‌, కొత్త టెంపర్‌మెంట్‌తో బరిలోకి దిగిన డీసీ.. సంచలనం సృష్టిస్తూ.. ఏకంగా ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఐపీఎల్‌ 2008లో పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌లో ఉన్న డెక్కన్‌ ఛార్జర్స్‌.. ఐపీఎల్‌ 2009లో మాత్రం ఛాంపియన్‌గా నిలిచింది.

ఇదే ఇప్పుడు సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కు గట్టి నమ్మకం కల్పిస్తోంది. ఐపీఎల్‌ 2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఎడెన్‌ మార్కరమ్‌ కెప్టెన్సీలోని ఎస్‌ఆర్‌హెచ్‌.. ఫేలవ ప్రదర్శనతో దారుణంగా నిరాశపర్చింది. దీంతో.. ఐపీఎల్‌ 2024కు సన్‌రైజర్స్‌ కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్‌, కొత్త యాటిట్యూడ్‌తో బరిలోకి దిగింది. అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో ఐపీఎల్‌ చరిత్రనే తిరగరాసింది. అయితే.. ఐపీఎల్‌ 2008, 2009 ప్రకారం.. ఐపీఎల్‌ 2023లో టేబుల్‌లో చివర్లో ఉన్న సన్‌రైజర్స్‌.. ఈ సీజన్‌లో కప్పు కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇప్పటికే ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌ మరొక్క మ్యాచ్‌ గెలిస్తే.. సెంటిమెంట్‌ను రిపీట్‌ చేస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి