iDreamPost
android-app
ios-app

Paris Olympics 2024: PV సింధు డ్రెస్‌ కోడ్‌పై తీవ్ర దూమారం! దేశం పరువుపోయిందంటూ..

  • Published Jul 27, 2024 | 5:46 PM Updated Updated Jul 27, 2024 | 5:46 PM

PV Sindhu, Paris Olympics 2024, Nandita Iyer: ప్రతిష్టాత్మక ప్యారిస్‌ ఒలిం​పిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన పీవీ సింధు చీరపై తాజాగా తీవ్ర వివాదం రాజుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

PV Sindhu, Paris Olympics 2024, Nandita Iyer: ప్రతిష్టాత్మక ప్యారిస్‌ ఒలిం​పిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లిన పీవీ సింధు చీరపై తాజాగా తీవ్ర వివాదం రాజుకుంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Jul 27, 2024 | 5:46 PMUpdated Jul 27, 2024 | 5:46 PM
Paris Olympics 2024: PV సింధు డ్రెస్‌ కోడ్‌పై తీవ్ర దూమారం! దేశం పరువుపోయిందంటూ..

ఒలింపిక్స్‌ లాంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో పతకాలు గెలిచి.. దేశ ప్రతిష్టతను పెంచాలనే లక్ష్యంతో భారత అథ్లెట్ల బృందం ప్యారిస్‌లో అడుగుపెట్టింది. అట్టహాసంగా మొదలైన ప్యారిస్‌ ఒలింపిక్స్‌ 2024 ప్రారంభ వేడుకల్లో మన తెలుగమ్మాయి, ఇండియన్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఫ్లాగ్‌ బేరర్‌గా.. భారత జాతీయ జెండాను చేతబట్టి.. భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది. ఈ అరుదైన దృశ్యాలను చూసి.. భారతీయులు పులకించిపోయారు. అయితే.. ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో పాల్గొనేందుకు ముందు ఇండియన్‌ అథ్లెట్లకు ఇచ్చిన డ్రెస్‌ కోడ్‌ చీరలో ఉన్న ఫొటోలను పీవీ సింధు తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

పీవీ సింధు ధరించిన చీరపై వివాదం చెలరేగింది. ఇదే డ్రెస్‌ కోసం.. దేశం పరువుతీసేలా ఉందని, ఇంత కంటే మంచి డ్రెస్‌లు, చీరలు ముంబై వీధుల్లో రూ.100కి, రూ.200లకి కూడా దొరుకుతాయని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒలిపింక్స్‌ లాంటి ప్రతిష్టాత్మక వేదికపై భారతదేశం పరువుతీసేలా డ్రెస్‌ కోడ్‌ను డిజైన్‌ చేశారంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. పీవీ సింధు పెట్టిన ఫొటోలపై బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్‌ నందితా అయ్యర్‌ స్పందిస్తూ.. తరుణ తహిలియానీ.. మీరు డిజైన్‌ చేసిన ఈ యూనిఫామ్స్‌ కంటే మంచి చీరలు రూ.200లకు ముంబై వీధుల్లో అమ్ముతారు. చౌకైన పాలిస్టర్‌ వస్త్రంతో, ఇకత్‌ ప్రింట్‌, జాతీయ జెండా రంగులతో డిజైన్‌ చేసిన డ్రెస్‌ కోడ్‌ అధ్వానంగా ఉందంటూ విమర్శించారు. చివరి నిమిషాల్లో హడావిడిగా వీటిని డిజైన్‌ చేశారా? అంటూ పేర్కొన్నారు. అలాగే ఈ చీర ధరించిన క్రీడాకారిణి గురించి తాను అగౌరవంగా మాట్లాడం లేదని, కేవలం డిజైన్‌ గురించే చెబుతున్నట్లు నందితా వివరణ ఇచ్చారు.

అలాగే మనవారు ధరించిన కుర్తా పైజామా డిజైన్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. మరీ ఇంత దారుణంగా డిజైన్‌ చేశారేంటి అంటూ నెటిజన్లు అసంతవృప్తి వ్యక్తం చేస్తున్నారు. మన సంస్కృతి సంప్రదాయం ఒట్టి పడేలా మ​ంచి డిజైన్‌ చేసి ఉండాల్సిందంటూ సూచిస్తున్నారు. కాగా.. భారత అథ్లెట్ల కోసం రూపొందించిన ఈ డ్రెస్‌ కోడ్‌ను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ తరుణ తహిలియానీ డిజైన్‌ చేశారు. ముంబైకి చెందిన తహిలియానీ తన భార్యతో కలిసి తహిలియానీ ఫ్యాషన్‌ స్టూడియోను స్థాపించారు. ప్రముఖలకు దుస్తులు, అలాగే పెద్ద హాటల్స్‌, రెస్టారెంట్లకు ఇంటీరియర్స్‌ కూడా డిజైన్‌ చేస్తుంటారు. మరి భారత అథ్లెట్లు ధరించిన డ్రెస్‌ కోడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ​