iDreamPost
android-app
ios-app

సిరాజ్ కు CM రేవంత్ సర్ ప్రైజ్.. ఇంటి స్థలం- ప్రభుత్వ ఉద్యోగం!

CM Revanth Announced Land And Government Job For Siraj: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహ్మద్ సిరాజ్ కు భారీ శుభవార్తను అందించారు.

CM Revanth Announced Land And Government Job For Siraj: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మహ్మద్ సిరాజ్ కు భారీ శుభవార్తను అందించారు.

సిరాజ్ కు CM రేవంత్ సర్ ప్రైజ్.. ఇంటి స్థలం- ప్రభుత్వ ఉద్యోగం!

టీమిండియా పొట్టి క్రికెట్ సమయంలో ప్రపంచ ఛాపింయన్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆటగాళ్లు ఇప్పటికే దేశంలో పెద్దఎత్తున ర్యాలీ చేశారు. అలాగే అందరు ఆటగాళ్లు వారి వారి ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా ఆత్మీయ ఆహ్వానాలను అందుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాదీ స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ భాగ్యనగరంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సిరాజ్ కు హైదరాబాద్ వాసులు సాదర ఆహ్వానం పలికారు. పెద్దఎత్తున ర్యాలీ చేసుకుని తీసుకెళ్లారు. తాజాగా సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిశాడు. తాను సాధించిన మెడల్ ను ఆయనకు చూపించాడు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరాజ్ భారీ సర్ ప్రైజ్ ఇచ్చారు.

మహ్మద్ సిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశాడు. తాను సాధించిన మెడల్ ను ముఖ్యమంత్రికి చూపించాడు. అలాగే తన జెర్సీని సీఎంకి బహూకరించాడు. సిరాజ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి సన్మానించారు. అంతేకాకుండా సిరాజ్ కు భారీ శుభవార్త కూడా అందించారు. సిరాజ్ కు ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సిరాజ్ కోసం మంచి ఇంటి స్థలం చూడాలి అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తానికి సిరాజ్ కు ముఖ్యమంత్రి మంచి శుభవార్తే అందించారు.

సిరాజ్- ముఖ్యమంత్రిని కలిసి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, టీమిండియా మాజీ దిగ్గజ ఆటగాడు అజహరుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఇంక వరల్డ్ కప్ హీరోస్ కి బీసీసీఐ రూ.125 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బహుమతిలో సిరాజ్ కు వాటాగా రూ.5 కోట్లు దక్కనున్నాయి. మొత్తం 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు చొప్పున బీసీసీఐ అందించనుంది. అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో సిరాజ్ కు హైదరాబాద్ లో ఇంటి స్థలం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా దక్కింది. ఇంక సౌత్ ఆఫ్రికాని టీమిండియా 7 పరుగుల తేడాతో మట్టికరిపించిన విషయం తెలిసిందే. ఈ వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మహ్మద్ సిరాజ్ కు ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.