iDreamPost
android-app
ios-app

Nahid Rana: భారత్ ను భయపెడుతున్న బంగ్లా యంగ్ ప్లేయర్! ఇబ్బందులు తప్పవా?

  • Published Sep 15, 2024 | 12:39 PM Updated Updated Sep 15, 2024 | 12:39 PM

IND vs BAN, Nahid Rana: పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదుంది బంగ్లాదేశ్. అదే జోరును టీమిండియాపై కూడా చూపించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బంగ్లా కుర్ర బౌలర్ టీమిండియాను భయపెడుతున్నాడు.

IND vs BAN, Nahid Rana: పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదుంది బంగ్లాదేశ్. అదే జోరును టీమిండియాపై కూడా చూపించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బంగ్లా కుర్ర బౌలర్ టీమిండియాను భయపెడుతున్నాడు.

Nahid Rana: భారత్ ను భయపెడుతున్న బంగ్లా యంగ్ ప్లేయర్! ఇబ్బందులు తప్పవా?

టీమిండియా దాదాపు నెలన్నర సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగబోతోంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో బంగ్లాదేశ్ ను ఢీకొనబోతోంది. తొలి మ్యాచ్ కి చెన్నై, రెండో మ్యాచ్ కు కాన్పూర్ వేదికలుగా మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక ఇప్పటికే చెన్నైలో ల్యాండ్ అయిన భారత్.. ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టేసింది. ఇక మరోవైపు పాకిస్థాన్ ను క్లీన్ స్వీప్ చేసి జోరుమీదుంది బంగ్లాదేశ్. అదే జోరును టీమిండియాపై కూడా చూపించాలని భావిస్తోంది. ఈ క్రమంలో బంగ్లా కుర్ర బౌలర్ టీమిండియాను భయపెడుతున్నాడు.

టీమిండియాను సొంత గడ్డపై ఓడించాలంటే హేమాహేమీ జట్లకే సాధ్యం కాదు. అలాంటిది బంగ్లాదేశ్ కు సాధ్యం అవుతుందా? అని అందరూ అంటున్నారు. కానీ.. ఈసారి బంగ్లా అంత తేలికగా కనిపించడం లేదు. లేటెస్ట్ గా పాక్ ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి ఫుల్ స్వింగ్ లో ఉంది. దాంతో భారత్ కు కష్టాలు తప్పవని కొందరు భావిస్తున్నారు. పైగా ఆ టీమ్ లో ఉన్న ఓ కుర్ర బౌలర్ తో ఇబ్బందులు తప్పవు అంటున్నారు కూడా. నిజమే బంగ్లాదేశ్ కు చెందిన 21 ఏళ్ల యంగ్ బౌలర్ నహిద్ రానాతో టీమిండియాకు ఇబ్బందులు తప్పేలా లేవు. నహిద్ రానా ఆడింది కేవలం 3 టెస్టులు మాత్రమే. కానీ.. స్టార్ బౌలర్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మూడు మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీశాడు.

ఇక పాక్ తో ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్ లో 6 వికెట్లు మాత్రమే తీసినప్పటికీ.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు భయం పుట్టిస్తున్నాడు. అతడి పేస్ బౌలింగ్ కు ఎత్తు అదనపు బలంగా మారింది. 6.2 అంగుళాల హైట్ తో మెరుపు వేగంతో బంతులు సంధించడంలో రానా సిద్ధహస్తుడు. ఇక ఇప్పుడు ఈ కుర్ర బౌలర్ టీమిండియాకు తలనొప్పిగా మారే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు క్రీడా పండితులు. అయితే ఈ విషయాన్ని ముందే పసిగట్టిన టీమిండియా నెట్స్ లో ఆరున్నర అడుగుల ఎత్తు ఉన్న పంజాబీ స్పీడ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ తో ప్రాక్టీస్ చేస్తున్నారు. దాంతో అతడి బౌలింగ్ ను ఈజీగా ఎదుర్కోగలుగుతారు. మరి నిజంగానే నహిద్ రానాతో టీమిండియాకు ఇబ్బందులు తప్పవని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.