iDreamPost

ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించడం అంటే ఇదేనేమో! 32 బంతుల్లోనే..

  • Published Aug 05, 2023 | 1:42 PMUpdated Aug 05, 2023 | 1:42 PM
  • Published Aug 05, 2023 | 1:42 PMUpdated Aug 05, 2023 | 1:42 PM
ఒంటిచేత్తో మ్యాచ్‌ గెలిపించడం అంటే ఇదేనేమో! 32 బంతుల్లోనే..

ఆరంభం నుంచి వికెట్లు పడుతూనే ఉన్నాయి. వచ్చిన బ్యాటర్లు పదో పరకో పరుగులు చేయడం అవుటై పెవిలియన్‌ చేరడం.. అప్పటికే మ్యాచ్‌ 75 శాతం పూర్తి అయిపోయింది. మరి కొన్ని బంతుల ఆట మాత్రమే మిగిలి ఉంది. మొత్తానికి 76 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి టీమ్‌ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇక్కడి నుంచి ఆ జట్టు కనీసం 100 పరుగులు చేసినా గొప్పే అని అంతా భావించారు. కానీ, ఇక్కడి నుంచే పరుగులు సునామీ మొదలైంది. అప్పటి వరకు వికెట్ల పండగ చేసుకున్న బౌలర్లు.. క్రిస్ జోర్డాన్ ఊచకోతకు బలైపోయారు. కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో జోర్డాన్ చెలరేగిపోయాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న ‘ది హండ్రెడ్‌’ లీగ్‌లో భాగంగా సదరన్ బ్రేవ్ – వెల్ష్ ఫైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ జోర్డాన్‌ ఈ సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. సదరన్‌ బ్రేవ్‌ జట్టుకు ఆడుతున్న జోర్డాన్‌.. సూపర్ ఇన్నింగ్స్‌ వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రేవ్‌ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఫిన్‌ అలెన్‌, కాన్వె, టిమ్‌ డేవిడ్‌.. ఇలా హేమాహేమీ బ్యాటర్లంతా విఫలమయ్యారు. వాళ్ల బ్యాటింగ్‌ కోలాప్స్‌ అవుతున్న తీరు చూసి.. వీళ్లు వంద పరుగులు కూడా చేయలేరని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. 56 పరుగులకే 6 వికెట్లు కోల్పోయారు. అప్పటికే వంద బంతుల ఇన్నింగ్స్‌లో 54 బంతులు అయిపోయాయి. ఈ టైమ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ జోర్డాన్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు.

క్రీజ్‌లోకి వచ్చి రావడంతోనే బాదుడు మొదలు పెట్టాడు. అది ఊచకోతతో వంద కూడా దాటదని అనుకున్న బ్రేవ్‌ స్కోర్‌ 100 బంతులు ముగిసే సరికి.. 8 వికెట్ల నష్టానికి బ్రేవ్‌ జట్టు ఏకంగా 147 పరుగులు చేసింది. ఇందులో జోర్డాన్‌ చేసినవే 70 పరుగులు ఉన్నాయి. ఇక ఈ టార్గెట్‌ ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ ఫైర్‌ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసి రెండు రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. ఆ జట్టులో డేవిడ్‌ విల్లీ 31 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. బ్రేవ్‌ జట్టు బౌలర్లలో క్రెయిగ్ ఓవర్టన్, మిల్స్‌, రెహాన్‌ అహ్మద్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. జార్జ్‌ ఒక వికెట్‌ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో క్రిస్‌ జోర్డాన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వెంకటేశ్‌ ప్రసాద్‌.. ఇతనో చరిత్ర గుర్తించని ఇండియన్‌ మెక్‌గ్రాత్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి