Chris Gayle: వీడియో: క్రిస్ గేల్ మంచి మనసు.. ఇలాంటి పని ఎవరూ చేసి ఉండరు!

వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్​ మరోమారు మంచి మనసు చాటుకున్నాడు. అతడి చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా ప్రశంసించకుండా ఉండలేరు.

వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్​ మరోమారు మంచి మనసు చాటుకున్నాడు. అతడి చేసిన పని గురించి తెలిస్తే ఎవ్వరైనా ప్రశంసించకుండా ఉండలేరు.

క్రికెట్​లో వందల మంది బ్యాటర్లు వచ్చారు, పోయారు. కానీ కొంతమంది మాత్రమే స్టార్లుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపర్చుకుంటూ సుదీర్ఘ కాలం కెరీర్​ను పొడిగించుకున్నారు. ఇలా ఎక్కువ కాలం ఆడిన వారిలో క్లాసిక్ ప్లేయర్సే అధికం. కానీ విధ్వంసక ఆటతీరుతో ఎక్కువ కాలం కంటిన్యూ అయిన వారు కూడా ఉన్నారు. అలాంటి అరుదైన క్రికెటర్లలో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఒకడు. అతడు క్రీజులోకి అడుగు పెడితే ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతారు. గేల్ బ్యాట్​ గర్జించిందా.. ప్రత్యర్థులకు ఇక నిద్రలేని రాత్రులే. అంతగా ధనాధన్ ఇన్నింగ్స్​లతో అపోజిషన్ టీమ్స్​ను వణికించాడు గేల్. కొన్ని సంవత్సరాల పాటు టెస్ట్, వన్డే, టీ20ల్లో తిరుగులేని బ్యాటర్​గా కంటిన్యూ అయ్యాడు. అలాంటి గేల్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. అతడు చేసిన పని గురించి తెలిస్తే మీరు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు.

జమైకాలోని ఓ గ్యాస్ స్టేషన్​లో చాలా మంది వాహనదారులు గ్యాస్ ఫిల్లింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చాడు గేల్. స్టార్ క్రికెటర్​ను చూసి ప్రజలు ఒక్కసారిగా షాకయ్యారు. అయితే వాళ్లను మరింతగా సర్​ప్రైజ్ చేశాడతను. ఆ గ్యాస్ స్టేషన్​లోని వెహికిల్స్​ అన్నింటి బిల్లు గేల్ చెల్లించాడు. దీంతో వాహనదారులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అంతేగాక వారందరితో కలసి సెల్ఫీలు దిగాడు యూనివర్సల్ బాస్. గేల్​ను కలిశామని.. ఆయనే తమ వెహికిల్ గ్యాస్ బిల్ చెల్లించాడని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర​ల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్స్.. గేల్ మంచి మనసును పొగుడుతున్నారు. అతడు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని.. సామాన్య ప్రజలతో ఇట్టే కలిసిపోతాడని అంటున్నారు. గేల్ లాంటి సెలబ్రిటీలు చాలా అరుదని కామెంట్స్ చేస్తున్నారు. అతడిలా సాయం చేసే గుణం అందరికీ ఉండదని చెబుతున్నారు.

ఇక, గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్​కు దూరమై చాన్నాళ్లు కావొస్తోంది. చివరగా 2021లో ఆస్ట్రేలియాతో అబుదాబీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్​లో ఆడాడు. వన్డేల్లో 2019లో టీమిండియాతో స్వదేశంలో జరిగిన సిరీస్​లో ఆఖరిగా పాల్గొన్నాడు యూనివర్సల్ బాస్. గేల్ ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే వెస్టిండీస్ క్రికెట్​కు మాత్రం అతడు దూరంగా ఉంటున్నాడు. కెరీర్​లో మొత్తం 301 వన్డేలు ఆడిన గేల్ 10,480 పరుగులు చేసి, 167 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 103 మ్యాచుల్లో 7,214 పరుగులు చేసి 73 వికెట్లు తీశాడు. అదే టీ20ల్లో 79 మ్యాచులకు కరీబియన్ టీమ్​కు ప్రాతినిధ్యం వహించిన ఈ లెజెండరీ ప్లేయర్ 1,899 రన్స్ చేయడంతో పాటు 20 వికెట్లు తన అకౌంట్​లో వేసుకున్నాడు. అలాంటి గేల్ మరోమారు తన మంచి మనసును చాటుకొని వార్తల్లో నిలిచాడు. మరి.. గేల్​ వాహనదారుల గ్యాస్ బిల్స్ కట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ఇంగ్లండ్​తో సిరీస్​లో దక్కిన చోటు.. శ్రేయస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..!

Show comments