iDreamPost
android-app
ios-app

స్మృతి మంధాన కోసం 1200 కిమీ జర్నీ చేసిన చైనా అభిమాని!

  • Published Sep 26, 2023 | 6:26 PM Updated Updated Sep 26, 2023 | 6:26 PM
  • Published Sep 26, 2023 | 6:26 PMUpdated Sep 26, 2023 | 6:26 PM
స్మృతి మంధాన కోసం 1200 కిమీ జర్నీ చేసిన చైనా అభిమాని!

టీమిండియా క్రికెటర్‌ స్మృతి మంధాన ఫ్యాన్‌ క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఉమెన్స్‌ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోయినా.. ఈ క్రికెటర్‌కు మాత్రం భారీ క్రేజ్‌ ఉంది. ఆటతోనే కాదు అతన అందంతో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది మంధాన. తాజాగా ఏషియన్‌ గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు గోల్డ్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో మంధాన అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుని.. టీమిండియాను గెలిపించింది. అయితే.. మంధానకు ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారనే విషయం తెలిసిందే. కానీ, క్రికెట్‌ అంటే పెద్దగా పరిచయం లేని చైనా దేశంలో కూడా మంధానకు ఓ వీరాభిమాని ఉండటం విశేషం.

ఏషియన్‌ గేమ్స్‌లో చైనాలో జరుగుతుండటంతో.. క్రికెట్‌ పోటీలో కూడా అక్కడే నిర్వహించారు. దీంతో.. మంధాన ఆట చూసేందుకు చైనా వీరాభిమాని తనుండే చోటు నుంచి.. దాదాపు 1200 కిలో మీటర్లు ప్రయాణం చేసి.. స్టేడియానికి చేరుకున్నాడు. మంధాన బ్యాటింగ్‌ చూస్తూ.. మురిసిపోయిన అతను.. ఏకంగా మంధాన దేవత అంటూ ప్లకార్డు పట్టుకుని హడావిడి చేశాడు. ఓ చైనా దేశస్థుడు భారత మహిళా క్రికెటర్‌ను ఏకంగా దేవతతో పోల్చుతూ.. ఇంతలా అభిమానం చూపించడంతో.. కెమెరా కళ్లని అంతనిపైనే పడ్డాయి. జున్ యు (Jun Yu) అనే వ్య‌క్తి బీజింగ్ నుంచి మ్యాచ్‌ జరిగిన హాంగ్జౌకి వచ్చి మరీ మంధానకు తన మద్దతు తెలిపాడు.

మ్యాచ్ అనంత‌రం ఓ రిపోర్ట‌ర్ మాట్లాడిన జున్‌ యు.. తాను మంధానకు మాత్ర‌మే అభిమాని కాద‌ని, క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్, ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీలకు కూడా అభిమానని చెప్పుకొచ్చాడు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు గొప్ప ఆట‌గాళ్లు అని, సూర్య‌కుమార్ యాద‌వ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా మంచి ప్లేయ‌ర్లు అని అన్నాడు. 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస్ట్రేలియాపై బుమ్రా బౌలింగ్ అద్భుతం అని కొనియాడాడు. ఇక తాను బీజింగ్‌లోని త‌న యూనివ‌ర్సిటీలో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న‌ట్లు తెలిపాడు. తాను ఎక్కువగా భార‌త క్రికెట‌ర్ల‌ను ఆరాధించిన‌ప్ప‌టికీ త‌న ఫేవ‌రేట్ క్రికెట‌ర్ మాత్రం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ అని జున్ చివర్లో షాక్‌ ఇచ్చాడు. మరి ఓ చైనీస్‌ ఫ్యాన్‌ మంధానను దేవత అని పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆ రోజు పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్‌లు! ఓ మృగం వచ్చి మీద పడ్డట్టు..!