iDreamPost
android-app
ios-app

వీడియో: ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి! ఈ బుడ్డోళ్ల ఆటకు ఫిదా అవ్వాల్సిందే!

  • Published Mar 11, 2024 | 3:33 PM Updated Updated Mar 11, 2024 | 3:33 PM

క్రికెట్​ను అందరూ ఆడే దాని కంటే చాలా డిఫరెంట్​గా ప్రయత్నించారీ బుడ్డోళ్లు. వాళ్లు ఆడుతున్న తీరు చూస్తే ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి అనకమానరు.

క్రికెట్​ను అందరూ ఆడే దాని కంటే చాలా డిఫరెంట్​గా ప్రయత్నించారీ బుడ్డోళ్లు. వాళ్లు ఆడుతున్న తీరు చూస్తే ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి అనకమానరు.

  • Published Mar 11, 2024 | 3:33 PMUpdated Mar 11, 2024 | 3:33 PM
వీడియో: ఇది క్రికెట్​ కాదు.. అంతకుమించి! ఈ బుడ్డోళ్ల ఆటకు ఫిదా అవ్వాల్సిందే!

క్రికెట్​ అంటే ప్రాణాలు ఇచ్చే దేశమిది. ఇక్కడ ప్రతి గల్లీలోనూ, గ్రామంలోనూ ఎవరో ఒకరు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. బాల్, బ్యాట్ ఉండని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంతగా మన దేశ ప్రజల జీవితాలతో ఈ ఆట మమేకం అయిపోయింది. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు బ్యాట్ పట్టి సిక్స్ కొట్టినవారే. స్కూల్​లోనో లేదా ఇంటి పక్కన గ్రౌండ్​లోనో బాల్ చేత పట్టి పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేసినవారే. కాలేజీలకు వెళ్లే కుర్రాళ్ల నుంచి ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల వరకు వీకెండ్స్​లో క్రికెట్​ ఆడటం అలవాటుగా మారడం తెలిసిందే. అయితే మామూలుగా క్రికెట్ అంటే గల్లీలు లేదా గ్రౌండ్​లోనో ఆడుతుంటారు. ఖాళీ మైదానాలు, పొలాల్లోనూ ఆడటం చూస్తుంటాం. అయితే ఇది మాత్రం అంతకుమించి అనే చెప్పాలి.

క్రికెట్ ఇలా కూడా ఆడొచ్చా అని ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోకమానరు. గల్లీ క్రికెట్, గ్రౌండ్ క్రికెట్ గురించి తెలిసిందే. కొందరు ఒక జట్టుగా ఏర్పడి ఆడటం మామూలే. కానీ ఇది బురదలో ఆడే క్రికెట్​. ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడూ వినుండరు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో కొందరు పిల్లలు బురదతో ఉన్న ఒక మైదానంలో ఉన్నారు. వాళ్ల ఒంటినిందా బురదే. అయితే అక్కడ రెండు వైపులా వికెట్లు పాతి ఉన్నాయి. ఒకవైపు వికెట్ల వెనుక కీపర్, మరోవైపు బౌలర్ ఉన్నారు. బౌలింగ్ ఎండ్ వైపు మరో పిల్లాడు తలకు క్యాప్ పెట్టుకొని అంపైరింగ్ చేస్తున్నాడు. అంత బురదలోనూ ఓ పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేశాడు. దాన్ని అదను చూసి లెగ్ సైడ్ షాట్ కొట్టాడు బ్యాటర్.

ఆన్ సైడ్ ఉన్న ఫీల్డర్ బ్యాటర్ కొట్టిన ఆ బాల్​ను అందుకున్నాడు. వెంటనే దాన్ని బౌలర్ వైపు విసిరాడు. బౌలర్ ఆ బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. అంత బురదలోనూ బౌలర్ పరిగెత్తుకుంటూ రావడం, ఇటు బ్యాటర్ రన్ కోసం పరుగులు తీయడం, ఫీల్డర్ రనౌట్ కోసం ప్రయత్నించడం అంతా నార్మల్ గ్రౌండ్​లో మాదిరిగానే జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో మీద నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది నెక్స్ట్ లెవల్ క్రికెట్ అని అంటున్నారు. బురదలో ఆడే కాన్సెప్ట్‌ సూపర్బ్ అని.. దీని వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం అని చెబుతున్నారు. ఒంటి మీద బురదతో ఎక్కువ సేపు ఉండటం వల్ల శరీరం మరింత ఫిట్​గా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్​ను తాము కూడా ప్రయత్నిస్తామని చెబుతున్నారు. మరి.. మడ్ క్రికెట్ కాన్సెప్ట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం! ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం ఇది!