SNP
Ajit Agarkar, IND vs SL: భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్.. ఓ ఆటగాడిని అసలు లెక్కలోకే తీసుకోలేదంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు లెక్కలోకి తీసుకోలేదో ఇప్పుడు చూద్దాం..
Ajit Agarkar, IND vs SL: భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్.. ఓ ఆటగాడిని అసలు లెక్కలోకే తీసుకోలేదంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? ఎందుకు లెక్కలోకి తీసుకోలేదో ఇప్పుడు చూద్దాం..
SNP
శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన జట్లపై భారత క్రికెట్‌లో తీవ్ర వివాదం రాజుకుంది. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో టీ20 కెప్టెన్ పోస్ట్ ఖాళీ అయింది. క్రికెట్ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ.. సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. అంతకంటే ముందు అంతా హార్ధిక్ పాండ్యాను టీ20 కెప్టెన్ చేస్తారని భావించారు.. కానీ, పాండ్యాకు హ్యాండ్ ఇచ్చింది భారత క్రికెటర్ బోర్డు. అలాగే ఉన్న వైస్ కెప్టెన్సీ పోస్టు కూడా పీకేసింది. అలాగే సంజూ శాంసన్‌ను వన్డేలకు ఎంపిక చేయలేదు, జింబాబ్వే సిరీస్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మలను టీ20 టీమ్ నుంచి తప్పించారు సెలెక్టర్లు. ఇలా ఇన్ని వివాదాస్పద నిర్ణయాలతో బీసీసీఐతో పాటు చీఫ్ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వాటన్నింటికి సమాధానం చెప్పేందుకు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాజాగా ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్నారు. హార్ధిక్ పాండ్యాను కాదని, సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ ఇవ్వడం, అలాగే రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ లాంటి వాళ్లకు జట్టులో చోటు కల్పించకపోవడంపై వివరణ ఇచ్చిన చీఫ్ సెలెక్టర్ అగార్కర్.. ఆ తర్వాత.. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను వన్డే టీమ్‌లోకి తీసుకోకపోవడంపై కూడా స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ వన్డే వరల్డ్ కప్ 2023 ఆడిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్‌ను ఇప్పుడు వన్డే జట్టు నుంచి తప్పించారు.
ఈ విషయంపై అగార్కర్ స్పందిస్తూ.. ‘సూర్యకుమార్ యాదవ్‌ను అసలు వన్డే జట్టు కోసం పరిశీలనలోకే తీసుకోలేదు. అతను నిఖార్సయిన టీ20 ప్లేయర్. పైగా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు టీమిండియాలోకి తిరిగి వచ్చారు. గత ఏడాది కాలంగా వాళ్లిద్దరూ వన్డేల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. వారితో పాటు రిషభ్ పంత్ కూడా వన్డే టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ వన్డే టీమ్‌లో అతని అవసరం లేదని భావించాం’ అంటూ అగార్కర్ పేర్కొన్నాడు. మరి సూర్య విషయంలో అగార్కర్ ఇచ్చిన వివరణపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Agarkar said “We haven’t discussed about Surya in ODIs, Shreyas is back, KL is back – both had great World Cups – now, Rishabh is back so as of now, Surya only in T20Is”. pic.twitter.com/p1zPRjZC8h
— Johns. (@CricCrazyJohns) July 22, 2024