iDreamPost
android-app
ios-app

పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం చెప్పిన చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌

  • Published Jul 22, 2024 | 10:52 AM Updated Updated Jul 22, 2024 | 10:52 AM

Ajit Agarkar, Suryakumar Yadav, Hardik Pandya, BCCI, Captaincy: టీమిండియా టీ20 కెప్టెన్సీ హార్ధిక్‌ పాండ్యాకు ఇవ్వకుండా.. సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇవ్వడానికి గల కారణాలు స్పష్టంగా వెల్లడించాడు. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Ajit Agarkar, Suryakumar Yadav, Hardik Pandya, BCCI, Captaincy: టీమిండియా టీ20 కెప్టెన్సీ హార్ధిక్‌ పాండ్యాకు ఇవ్వకుండా.. సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇవ్వడానికి గల కారణాలు స్పష్టంగా వెల్లడించాడు. మరి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Published Jul 22, 2024 | 10:52 AMUpdated Jul 22, 2024 | 10:52 AM
పాండ్యాను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం చెప్పిన చీఫ్‌ సెలెక్టర్‌ అగార్కర్‌

రోహిత్‌ శర్మ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో ఇటీవల టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌ను నియమించింది బీసీసీఐ. ముందుగా అందరు భావించినట్లు.. హార్ధిక్‌ పాండ్యాకు కాకుండా సూర్యకుమార్‌ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా ప్రకటించింది.. ఊహించని షాకిచ్చింది. దీనిపై క్రికెట్‌ అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో జట్టు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న పాండ్యాకు కాకుండా.. కెప్టెన్సీ అనుభవం పెద్దగా లేని సూర్యకుమార్‌ యాదవ్‌కు ఎలా టీ20 కెప్టెన్సీ ఇస్తారంటూ.. కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు చేశారు. దీనిపై తాజాగా భారత చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పందిస్తూ.. సూర్యకు ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాల్సి వచ్చింది, పాండ్యాకు ఎందుకు ఇవ్వలేదో వివరించాడు.

చీఫ్‌ సెలెక్టర్ అజిత్‌ అగార్కర్‌ మాట్లాడుతూ.. ‘సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ అర్హుడు కాబట్టే అతనికి టీ20 కెప్టెన్సీ అప్పగించాడు. అన్ని విధాలా అతను కెప్టెన్సీకి ఎలిజిబుల్‌ క్యాండిడేట్‌. పైగా టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్‌. కెప్టెన్‌ అనే వాడు అన్ని మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఫిట్‌నెస్‌ కారణంగా కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడతాము అంటే కుదరదు. కెప్టెన్సీ విషయంలో హార్దిక్ పాండ్యాకు అతని ఫిట్‌నెస్ ప్రతికూలమైన అంశం’ అని అగార్కర్‌ పేర్కొన్నాడు.

హార్ధిక్‌ పాండ్యా తరచూ గాయాలపాలు అవుతాడనే విషయంపై అగార్కర్‌ గట్టి విమర్శ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ నిర్వహించిన మీటింగ్‌లో.. అజిత్‌ అగార్కర్‌ హార్ధిక్‌ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. సూర్యకుమార్‌ యాదవ్‌ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమైన బ్యాటర్‌తో పాటు ఫిట్‌గా ఉండి అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని, హార్ధిక్‌ పాండ్యా అయితే తరచు గాయాలపాలవుతూ.. మ్యాచ్‌లకు దూరం అవుతుంటాడని అందుకే పాండ్యాను కాదని, సూర్యకుమార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినట్లు అసలు విషయం బయటపెట్టాడు అగార్కర్‌. మరి ఆయన చెప్పిన కారణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.