క్రీడా నిబంధనలకు విరుద్దంగా ఆటగాళ్లు ప్రవర్తించినప్పుడు వారిపై చర్యలు తీసుకుంటూ ఉంటాయి సదరు క్రికెట్ బోర్డ్ లు. ఈ క్రమంలోనే వారిపై తాత్కాలిక నిషేధం విధించడమో, లేక కొన్ని మ్యాచ్ లు ఆడకుండా నిషేధించడమో జరుగుతూ ఉంటుంది. తాజాగా టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాపై సస్పెన్షన్ వేటు పడింది. అతడిని ఓ మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ విధిస్తున్నట్లు కౌంటీ ఛాంపియన్ అధికారులు వెల్లడించారు. మరి పుజారాపై మ్యాచ్ నిషేధానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చతేశ్వర్ పుజారా.. టీమిండియా నయావాల్ గా, రాహుల్ ద్రవిడ్ వారసుడిగా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రవేసుకున్నాడు. తన బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టేవాడు. ఇక క్రికెట్ లో వివాదాలకు దూరంగా ఉండే అతికొద్ది మంది ఆటగాళ్లలో పుజారా ఒకడు. అలాంటి పుజారాపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ అధికారులు. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం పుజారా ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ 2023లో సెసెక్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే ససెక్స్ జట్టుకు 12 పాయింట్ల పెనాల్టీ పడింది. దీంతో జట్టు కెప్టెన్ అయిన పుజారాపై వేటు పడింది. అతడిని ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధించారు కౌంటీ అధికారులు.
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ నిబంధనల ప్రకారం ఓ సీజన్ లో టీమ్ నాలుగు ఫిక్స్డ్ పెనాల్టీలు ఎదుర్కొంటే.. ఆ టీమ్ సారథిపై ఓ మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడుతుంది. ఇప్పుడు ఇదే జరిగింది. ప్రస్తుతం ససెక్స్ జట్టు నాలుగు పెనాల్టీలను ఎదుర్కొని మెుత్తంగా 12 డీమెరిట్ పాయింట్లను పొందింది. కాగా.. లీసెస్టర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో ససెక్స్ ఆటగాళ్లు టామ్ హెయిన్స్, జాక్ కార్సన్, అరి కార్వలాస్ లు గ్రౌండ్ లో నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారు. దీంతో కౌంటీ అధికారులు కెప్టెన్ ను బాధ్యుడిని చేస్తూ.. ఓ మ్యాచ్ నిషేధం విధించారు. టామ్ హెయిన్స్, జాక్ కార్సన్ లపై కూడా ఓ మ్యాచ్ నిషేధం విధించారు అధికారులు. మరి పుజారాపై ఓ మ్యాచ్ నిషేధం విధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cheteshwar Pujara has been suspended for a match after Sussex received a 12 point penalty in the County Championship. pic.twitter.com/CzDpsAbUuW
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2023