టీమ్​లో ప్లేస్ పోయిందని కసిగా ఆడుతున్న పుజారా!

  • Author singhj Updated - 05:36 PM, Sat - 23 December 23

ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని భారత్ చేజార్చుకుంది. ఐపీఎల్​లో ఆడి ప్లేయర్లు అలసిపోవడం, సరైన ప్రిపరేషన్, ప్రాక్టీస్ లేకపోవడం.. టీ20ల నుంచి లాంగ్ ఫార్మాట్​కు తగ్గట్లు ఆటతీరును అడ్జస్ట్ చేసుకోకపోవడం లాంటివి భారత ఓటమికి పలు కారణాలుగా చెప్పొచ్చు.

ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని భారత్ చేజార్చుకుంది. ఐపీఎల్​లో ఆడి ప్లేయర్లు అలసిపోవడం, సరైన ప్రిపరేషన్, ప్రాక్టీస్ లేకపోవడం.. టీ20ల నుంచి లాంగ్ ఫార్మాట్​కు తగ్గట్లు ఆటతీరును అడ్జస్ట్ చేసుకోకపోవడం లాంటివి భారత ఓటమికి పలు కారణాలుగా చెప్పొచ్చు.

  • Author singhj Updated - 05:36 PM, Sat - 23 December 23

వరల్డ్ టెస్ట్ సిరీస్​ ఫైనల్ ఓటమిని భారత క్రికెట్ అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో వరుసగా విఫలమవుతున్న టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓడిపోయి మరో ఐసీసీ ట్రోఫీని భారత్ చేజార్చుకుంది. ఐపీఎల్​లో ఆడి ప్లేయర్లు అలసిపోవడం, సరైన ప్రిపరేషన్, ప్రాక్టీస్ లేకపోవడం.. టీ20ల నుంచి లాంగ్ ఫార్మాట్​కు తగ్గట్లు ఆటతీరును అడ్జస్ట్ చేసుకోకపోవడం లాంటివి భారత ఓటమికి పలు కారణాలుగా చెప్పొచ్చు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన వారిలో దాదాపు అందరూ నేరుగా ఐపీఎల్​ నుంచి వచ్చినవారే. కానీ ఛటేశ్వర్ పుజారా మాత్రం ఈ మ్యాచ్​ కోసం ముందే ఇంగ్లండ్​కు చేరుకున్నాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ముందే ఇంగ్లండ్​కు చేరుకున్న పుజారా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు కౌంటీ మ్యాచులు ఆడాడు. కౌంటీట్లో అతడు రాణించాడు. కానీ ఆసీస్​తో మ్యాచ్​లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 41 రన్స్ చేశాడు. అతడితో పాటు మిగిలిన స్టార్ బ్యాటర్లు కూడా విఫలమవ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే అజింక్యా రహానె తప్ప అందరు బ్యాటర్లు ఫెయిలైనా సెలెక్టర్లు మాత్రం పుజారా పైనే వేటు వేశారు. వెస్టిండీస్​తో త్వరలో జరగబోయే టెస్టు సిరీస్​కు అతడ్ని ఎంపిక చేయలేదు. పుజారాను కావాలనే బలిపశువును చేశారంటూ కొందరు మాజీ ప్లేయర్లు కామెంట్స్ చేశారు.

టీమ్​లో నుంచి తనను తీసేయడంతో బాధపడిన పుజారా.. స్ట్రాంగ్​గా కమ్​బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలో దులీప్ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. జట్టులో నుంచి తనను తీసేశారనే బాధలో ఉన్న పుజారా.. దులీప్ ట్రోఫీలో కసితీరా ఆడుతున్నాడు. వెస్ట్​ జోన్ తరఫున బరిలోకి దిగిన పుజారా (265 బంతుల్లో 131) కీలకమైన సెమీఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అతడికి ఇది 60వ సెంచరీ కావడం విశేషం. తద్వారా సెంచరీల విషయంలో నాలుగో ప్లేసులో ఉన్న భారత మాజీ దిగ్గజం విజయ్ హజారే సరసన అతడు చేరాడు. టీమ్​లో నుంచి తనను తీసేసినందుకు ఈ సెంచరీ ద్వారా సెలెక్టర్లకు పుజారా బ్యాట్​తోనే సమాధానం చెప్పాడని విశ్లేషకులు అంటున్నారు. కాగా, పుజారా రాణించడంతో ఈ మ్యాచ్​లో వెస్ట్ జోన్ 300 రన్స్​ లీడ్ సాధించింది.

Show comments