iDreamPost
android-app
ios-app

IND vs SA: సీనియర్లను పట్టించుకోని BCCI! కోహ్లీ, రోహిత్ కాదు.. వారిద్దరి భవిష్యత్ ఏంటి?

  • Author Soma Sekhar Published - 08:47 AM, Fri - 1 December 23

సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్ కు ఇద్దరు సీనియర్లను బీసీసీఐ పట్టించుకోలేదు. కోహ్లీ, రోహిత్ కాదు.. వారిద్దరి భవిష్యత్ ఏంటి? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

సౌతాఫ్రికాతో జరగబోయే సిరీస్ కు ఇద్దరు సీనియర్లను బీసీసీఐ పట్టించుకోలేదు. కోహ్లీ, రోహిత్ కాదు.. వారిద్దరి భవిష్యత్ ఏంటి? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

  • Author Soma Sekhar Published - 08:47 AM, Fri - 1 December 23
IND vs SA: సీనియర్లను పట్టించుకోని BCCI! కోహ్లీ, రోహిత్ కాదు.. వారిద్దరి భవిష్యత్ ఏంటి?

దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎలాంటి జట్టును ప్రకటిస్తారా? అని టీమిండియా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. సఫారీ జట్టుతో 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది భారత జట్టు. ఇక ఈ సిరీస్ డిసెంబర్ 10న తొలి టీ20 మ్యాచ్ తో ప్రారంభం కానుంది. కాగా.. ఈ సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. రాబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని టీమ్ ను సిద్ధం చేసింది మేనేజ్ మెంట్. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్ నుంచి విశ్రాంతి కావాలని కోరడంతో.. వన్డేలకు వారికి రెస్ట్ ఇచ్చింది. టీ20లకూ వారు అందుబాటులో ఉండటం లేదు. ఇదిలా ఉండగా.. ఇద్దరు సీనియర్లను బీసీసీఐ పట్టించుకోలేదు. దీంతో వారి భవిష్యత్ ఏంటి? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరి ఆ సీనియర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నీ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనుంది భారత జట్టు. 3 టీ20లు, 3 వన్డేలు, రెండు టెస్టుల కోసం జట్లను ప్రకటించించి బీసీసీఐ. రాబోయే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకునే బీసీసీఐ ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. యంగ్ ప్లేయర్లకే అవకాశాలు ఇస్తూ.. ముందుకు సాగుతోంది టీమ్ మేనేజ్ మెంట్. కాగా.. తమకు రెస్ట్ కావాలని కోరడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు టీ20లు, వన్డేలకు విశ్రాంతి ఇచ్చింది.

ఇదిలా ఉండగా.. ఇద్దరు సీనియర్ బ్యాటర్లను సఫారీ సిరీస్ కు పట్టించుకోలేదు సెలెక్షన్ కమిటీ. వారిద్దరు అద్భుతమైన టెస్ట్ బ్యాటర్లు కావడం గమనార్హం. వీరిని సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టులకు ఎంపిక చేయకపోవడం సగటు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఇద్దరు బ్యాటర్లు ఎవరో కాదు.. ఒకరు చతేశ్వర్ పుజారా అయితే.. మరొకరు అజింక్యా రహనే. బీసీసీఐ వీరికి మెుండిచేయి చూపింది. టెస్టు క్రికెట్ కు పెట్టింది పేరు చతేశ్వర్ పుజారా. తన ఆటతీరుతో టీమిండియా నయా వాల్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సొగసరి బ్యాటర్. తనదైన బ్యాటింగ్ తో టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు.

అదీకాక ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టడంలో సిద్ధహస్తుడు పుజారా. ఇటీవల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో దుమ్మురేపాడు పుజారా. ఇలాంటి బ్యాటర్ ను టెస్టులకు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్నే కలిగించిందని చెప్పాలి. ఇక రహనే పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సెలెక్టర్లు గత కొన్ని నెలలుగా అతడి వైపు చూడటమే మానేశారు. విదేశీ పిచ్ లపై వీరిద్దరికి అమోఘనమైన రికార్డులు ఉన్నాయి. అయినప్పటికీ వీరికి షాకిచ్చింది మేనేజ్ మెంట్. దీంతో యంగ్ క్రికెటర్లు దూసుకొస్తున్న ఈ రోజుల్లో ఈ సీనియర్ బ్యాటర్ల భవిష్యత్ ఏంటి? అన్న ఆందోళన మెుదలైంది. మరి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కు పుజారా, రహనేను ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.