IPL 2024 సీజన్ కు సంబంధించి బిగ్ అప్డేట్.. ఆ వార్తలన్నింటికీ చెక్!

IPL Chairman Arun Dhumal: IPL 2024 సీజన్ కు సంబంధించి స్వయంగా టోర్నీ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూద్దాం.

IPL Chairman Arun Dhumal: IPL 2024 సీజన్ కు సంబంధించి స్వయంగా టోర్నీ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఓ బిగ్ అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఆ అప్డేట్ ఏంటో చూద్దాం.

IPL 2024.. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే మెగా జాతర. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించే బ్యాటర్లు, బుల్లెట్ల లాంటి బంతులతో బ్యాటర్లకు చెమటలు పట్టించే బౌలర్లు.. వీరితో పాటుగా చీర్స్ అంటూ చిందేసే చీర్ లీడర్స్. ఈ హంగామా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్. అయితే గత కొన్ని రోజులుగా ఐపీఎల్ పై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అసలు ఐపీఎల్ జరుగుతుందా? ఒకవేళ జరిగితే అది ఇండియాలోనేనా? లేక దుబాయ్ కి తరలుతుందా? షెడ్యూల్ ఎప్పుడు? ఇన్ని ప్రశ్నలు అభిమానుల్లో సందేహాన్ని రేకెత్తించాయి. తాజాగా ఐపీఎల్ ఛైర్మన్ నుంచి ఓ బిగ్ అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించి ఓ బిగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే? ఐపీఎల్ 2024 సీజన్ మ్యాచ్ లు ఇండియాలోనే జరుగుతాయని స్వయంగా ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని, దీంతో ఐపీఎల్ ను రెండు షెడ్యూల్స్ లో ఒకటి భారత్ లో మరోటి యూఏఈలో జరపనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ వార్తలన్నింటికీ తాజాగా చెక్ పెట్టాడు ఐపీఎల్ ఛైర్మన్. ఏకంగా ఆయనే ఐపీఎల్ ఇండియాలోనే జరుగుతుందని చెప్పడంతో టీమిండియా క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ తో బీసీసీఐ ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించగానే.. ఐపీఎల్ షెడ్యూల్ ను విడుదల చేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై.. మే 26న ముగుస్తుందని ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రచూరించింది. ఐపీఎల్ ఛైర్మన్ ప్రకటనతో భారత క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: క్రికెట్‌ చరిత్రలోనే విచిత్రమైన ఘటన! రూల్‌ ప్రకారం..

Show comments