iDreamPost
android-app
ios-app

సెలక్టర్లకు యుజ్వేంద్ర చాహల్ అదిరిపోయే కౌంటర్!

యుజ్వేంద్ర చాహల్ టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రదర్శనతో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశంసలు పొందాడు. కానీ, గతకొంతకాలంగా చాహల్ కు జట్టులో స్థానం దక్కలేదు.

యుజ్వేంద్ర చాహల్ టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రదర్శనతో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశంసలు పొందాడు. కానీ, గతకొంతకాలంగా చాహల్ కు జట్టులో స్థానం దక్కలేదు.

సెలక్టర్లకు యుజ్వేంద్ర చాహల్ అదిరిపోయే కౌంటర్!

పిట్ట కొంచం కూత ఘనం అనే సామెత యుజ్వేంద్ర చాహల్ కు సరిగ్గా సరిపోతుంది. చూడటానికి బక్క పలుచగా కనిపించే ఈ స్పిన్నర్ బరిలోకి దిగితే మాత్రం ప్రత్యర్థిని తన బంతులతో బోల్తా కొట్టిస్తూ ఉంటాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయినా కూడా మనోడు ముందు బలాదూర్ అవ్వాల్సిందే. అయితే కొన్ని పరిస్థితులు, జట్టు అవసరాల దృష్ట్యా చాహల్ ను సెలక్టర్లు వరల్డ్ కప్ 2023కి పక్కన పెట్టేశారు. సరే.. తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కి అయినా అవకాశం వస్తుందనుకుంటే మళ్లీ నిరాశే మిగిలింది. అయితే సెలక్టర్లకు చాహల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.

టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలో ఎక్కువ హ్యూమర్ కలిగిన ప్లేయర్ స్పిన్నర్ చాహల్. అతను మైదానంలో వేసే బంతులే కాదు.. విసిరే డైలాగులు, నెట్టింట చేసే రచ్చ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. అయితే చాహల్ కౌంటర్ అనగానే అందరూ కూడా చాహల్ ఏమైనా కామెంట్ చేశాడేమో అనుకుంటారు. కానీ, మనోడు మైదానంలో బంతితో టీమ్ సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో చాహల్ ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన చాహల్ కేవలం 26 పరుగులే ఇచ్చి ఏంకగా 6 వికెట్లు పడగొట్టాడు. యుజీ స్పిన్ జాలానికి ఉత్తరాఖండ్ జట్టు 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

జట్టులో చోటు దక్కలేదని కోపమో.. తన సత్తా చాటాలనే తాపత్రయమో తెలీదుగానీ.. చాహల్ దెబ్బకు ఉత్తరాఖండ్ ప్లేయర్లు అంతా పెవిలియన్ బాట పట్టారు. జట్టులో స్థానం దక్కకపోవడంపై చాహల్ అసహనంతో ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే జట్టు ప్రకటించిన తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలో నవ్వుతున్న ఈమోజీలు పెట్టాడు. అంటే చాహల్ గట్టిగానే హర్ట్ అయ్యాడని అందరూ భావించారు. ఇప్పుడు బాల్ తో చెలరేగడంతో ఆ విషయం కన్ఫామ్ అయ్యింది. చాహల్ ఇంతలా నిరాశ చెందడానికి కారణం లేకపోలేదు. తన ఆఖరి టీ20ని చాహల్ వెస్టీండీస్ తో ఆడాడు. ఆ తర్వాత జరిగిన ఐర్లాండ్ టూర్ కి గానీ, ప్రపంచకప్ కు ఎలాగూ పక్కన పెట్టారు. అలాగని ఏషియన్స్ గేమ్స్ లో కూడా స్థానం కల్పించలేదు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు కూడా సైడ్ చేయడంతో యుజ్వేంద్ర చాహల్ విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించి తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

రవి భిష్ణోయ్ తో చాహల్ రీప్లేస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆసీస్ తో సిరీస్ కి చాహల్ ని పక్కన పెట్టింది కూడా అతనికోసమే. అయిచే యుజీకి జట్టులో దక్కకపోవడానికి ఇంకో ప్రధాన కారణం ఉంది. మనోడు బ్యాటుతో పరుగులు రాబట్టలేకపోవడమే. ఎంత బౌలింగ్ చేసినా కూడా కనీస పరుగులు కూడా చేయలేడనే చాహల్ ను లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు జట్టులో ఆల్రౌండర్లు కూడా పెరిగిపోతున్నారు. అటు బాల్ తో ఇటు బ్యాటుతో రాణించగల కుర్రాళ్లు అందుబాటులో ఉన్నారు. అది కూడా చాహల్ స్థానానికి పెద్ద ముప్పులా మారింది. ఇంక యుజీ కెరీర్ విషయానికి వస్తే.. టీమిండియా తరఫున టీ20ల్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా యుజీ ఉన్నాడు. 2016లో జట్టు తరఫున తన కెరీర్ ని ప్రారంభించాడు. ఆడిన 80 టీ20 మ్యాచుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. మరి.. సెలక్టర్లకు యుజ్వేంద్ర చాహల్ ఇచ్చిన కౌంటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి