iDreamPost
android-app
ios-app

CCL 2024: సినిమా స్టార్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు! ఎలాగంటే..?

  • Published Feb 14, 2024 | 4:54 PM Updated Updated Feb 14, 2024 | 4:54 PM

ఫ్రొఫెషనల్‌ క్రికెటర్లను తలపిస్తూ.. సినిమా తారలు తమ క్రికెట్‌ టాలెంట్‌ను చూపించే లీగ్‌.. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌. ఈ లీగ్‌ పదో సీజన్‌ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మరి ఆ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

ఫ్రొఫెషనల్‌ క్రికెటర్లను తలపిస్తూ.. సినిమా తారలు తమ క్రికెట్‌ టాలెంట్‌ను చూపించే లీగ్‌.. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌. ఈ లీగ్‌ పదో సీజన్‌ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. మరి ఆ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం ఉంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 14, 2024 | 4:54 PMUpdated Feb 14, 2024 | 4:54 PM
CCL 2024: సినిమా స్టార్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు! ఎలాగంటే..?

సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్ 10వ ఎడిషన్‌ ప్రారంభానికి ముస్తాబు అవుతోంది. సీసీఎల్‌ 2024 సీజన్‌ ఈ నెల 23 నుంచి గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి టీమ్స్‌ పాల్గొంటున్నాయి. మన టాలీవుడ్‌ నుంచి తెలుగు వారియర్స్‌ టీమ్‌ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు వారియర్స్‌తో పాటు ముంబై హీరోస్‌, కేరళా స్ట్రైకర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, కర్ణాటక బుల్డోజర్స్‌, పంజాబ్‌ దే షేర్‌, చెన్నై రైనోస్‌, బెంగాల్‌ టైగర్స్‌ ఇలా మొత్తం 8 జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్‌ క్రికెట్‌ అభిమానులను ఎంతో అలరించాయి. ఇప్పుడు రాబోతున్న ఈ సీజన్‌ కూడా అంతే సక్సెస్‌ అవుతుందని నిర్వాహకులు ధీమాగా ఉన్నారు.

అయితే.. ఈ సారి లీగ్‌ స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచ్‌లు షార్జాలో నిర్వహిస్తున్నారు. తొలుత ఐదు మ్యాచ్‌లు దుబాయ్‌లోని షార్జాలో నిర్వహించనున్నారు. తర్వాత మ్యాచ్‌లు బెంగళూరు, హైదరాబాద్‌, ఛండీఘడ్‌, తిరువనంతపురం, విశాఖపట్నం వేదికల్లో జరగనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లను జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జియో సినిమాలో ఈ మ్యాచ్‌లో ఉచితంగా చూడొచ్చని జియో సినిమా తెలిపింది. మ్యాచ్‌లు ఈ నెల 23 నుంచి మార్చ్‌ 17 వరకు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ ముంబై హీరోస్‌-కేరళా స్ట్రైకర్స్‌ మధ్య జరగనుంది.

ఇక మన తెలుగు వారియర్స్‌ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఫిబ్రవరీ 24న భోజ్‌పురీ దబాంగ్స్‌తో షార్జాలో తొలి మ్యాచ్‌ ఆడనుంది. రెండో మ్యాచ్‌ను మార్చి 1న పంజాబ్‌ దే షేర్‌తో హైదరాబాద్‌లో ఆడనుంది. మార్చ్‌ 3న కేరళా స్ట్రైకర్స్‌తో హైదరాబాద్‌లోనే ఆడుతుంది. మార్చ్‌ 9న కర్ణాటక బుల్డోజర్స్‌తో తిరువనంతపురంలో మ్యాచ్‌ ఆడనుంది. మార్చి 15, 16 క్వాలిఫైయర్‌ 1, ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చ్‌ 17న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్ని విశాఖపట్నంలోనే జరగనుండటం విశేషం. మరి సీసీఎల్‌ 2024 షెడ్యూల్‌తో పాటు జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.