SNP
Virat Kohli, One8 Commune, Pub: భారత స్టార్ క్రికెటర్‌కి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌పై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Virat Kohli, One8 Commune, Pub: భారత స్టార్ క్రికెటర్‌కి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌పై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
SNP
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఎంజీ రోడ్‌లో ఉన్న ‘వన్ 8 కమ్యూన్ పబ్’పై మంగళవారం పోలీసులు రైడ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్లోజింగ్ టైమ్ దాటి పబ్‌ను నిర్వహిస్తుండటంతో పబ్ నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం రాత్రి ఒంటి గంటకు పబ్ మూసి వేయాలి. కానీ, రాత్రి 1.30 గంటల వరకు పబ్ ఓపెనర్ ఉండటంతో బెంగళూరు సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఒక్క పబ్ కాకుండా.. సిటీలోని అన్ని పబ్స్‌పై పోలీసులు రైడ్స్ చేపట్టారు. వాటిలో కొన్ని పబ్‌లు నిర్దేశిత సమయం దాటి ఓపెన్ ఉండటంతో కేసు నమోదు చేశారు.
ఈ విషయంపై బెంగళూరు సెంట్రల్ డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమించిన మూడు నాలుగు పబ్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ పబ్‌కైనా రాత్రి ఒంటి గంట వరకే పర్మిషన్ ఉందని, రాత్రి 1 తర్వాత పబ్‌లు ఓపెన్ ఉండటానికి వీలు లేదని, కానీ, కొన్ని పబ్‌లు రాత్రి 1, 1.30 దాటినా ఓపెన్ ఉంటున్నాయని అందుకే రైడ్లు నిర్వహించి.. చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. కేసులు నమోదు చేసిన పబ్‌పై విచారణ చేపట్టి మరిన్ని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక విరాట్ కోహ్లీకి చెందిన వ్యాపారల్లో పబ్స్, రెస్టారెంట్స్ ముఖ్యమైనవి. వన్ 8 కమ్యూన్ పేరుతో కోహ్లీ రెస్టారెంట్, ఇంకా పబ్స్ నిర్వహిస్తున్నాడు. పలు ప్రధాన నగరాల్లో ఈ పబ్‌లు ఉన్నాయి. బెంగళూరుతో పాటు ఢిల్లీ, ముంబై, పూణె, గురుగావ్, కోల్‌కత్తాలలో గత ఏడాది డిసెంబర్‌లో ఈ పబ్‌లను తెరిచారు. అలాగే ఇటీవల మన హైదరాబాద్‌లో కూడా వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. మరి కోహ్లీకి చెందిన పబ్‌పై కేసు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಮಾಲೀಕತ್ವದ ಪಬ್ ಮೇಲೆ FIR..! | GuaranteeNewshttps://t.co/zPAu9qTHXF#guaranteenews #bangalore #viratkohli #one8communepub #guaranteenewskannada pic.twitter.com/eVaFVoNfFo
— Guarantee News (@guaranteenews) July 9, 2024