SNP
SNP
టెన్నిస్‌లో అతనే నంబర్ వన్, ఏకంగా 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అతని ఖాతాలో ఉన్నాయి. పైగా గత నాలుగు వింబుల్డన్ టైటిళ్లను అతనే గెలుస్తున్నాడు.. అతనే టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్. అలాంటి దిగ్గజ ఆటగాడిని ఓ 20 ఏళ్ల కుర్రాడు ఓడించాడు. జకోవిచ్ సాధించిన గ్రాండ్‌స్లామ్స్ టైటిళ్ల సంఖ్య కంటే కూడా తక్కువ వయసున్న కార్లొస్ అల్కరాస్ చరిత్ర సృష్టించాడు. ఈ స్పెయిన్ యువ సంచలన తన తొలి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్‌ను సాధించాడు. దీంతో జకోవిచ్‌నే ఓడించినా ఈ నయా ప్రిన్స్ ఎవరంటూ ప్రపంచ మొత్తం ఆశ్చర్యం, ఆసక్తి చూపిస్తుంది. అతని గురించి కొన్ని విషయాలు మీ కోసం..
అల్కరాస్ పూర్తి పేరు.. కార్లోస్ అల్కరాస్ గార్ఫియా. 2003 మే 5న స్పెయిన్‌లో జన్మించాడు. టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న అల్కరాస్.. ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్‌లో 22వ ర్యాంక్ ప్లేయర్‌గా కొనసాగాడు. 2018లో ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత ఐటీఎఫ్ మెన్స్ వరల్డ్ టెన్నిస్ టూర్‌లో మూడు టైటిళ్లు, ఏటీపీ ఛాలెంజర్ టూర్‌లో నాలుగు టైటిళ్లను గెలుచుకున్నాడు. 2021లో ర్యాంకింగ్స్‌లో టాప్ 100లోకి ప్రవేశించాడు. రెండు నెలల తర్వాత, క్రొయేషియాలో అల్కరాస్ తన మొదటి ఏటీపీ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
ఓపెన్, ఏటీపీ 250 టోర్నమెంట్‌లో తన మొదటి టైటిల్‌ను గెలుచుకున్నాడు. తర్వాత యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుని ర్యాంకింగ్స్‌లో టాప్ 50లోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 2022లో రియో ఓపెన్‌లో తన మొదటి ఏటీపీ 500 టైటిల్, మయామి ఓపెన్‌లో మాస్టర్స్ 1000 టైటిల్, ఏప్రిల్‌లో బార్సిలోనా ఓపెన్‌లో ఏటీపీ 500 టైటిల్‌ను గెలిచాడు. సెప్టెంబర్ 2022లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో కాస్పర్ రూడ్‌ను ఓడించి అతని మొదటి మేజర్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. మే 2023లో అల్కరాస్‌కు లారెస్ వరల్డ్ బ్రేక్‌త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.
తాజాగా వింబుల్డన్‌లో జకోవిచ్‌ను ఓడించి తన కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ సాధించాడు. ఓపెన్ టెన్నిస్ లో 2వ మేజర్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన 5వ పిన్న వయస్కుడిగా అల్కరాస్ రికార్డు సృష్టించాడు. అలాగే ఓపెన్ ఎరాలో బేకర్, బ్జోర్గ్ తరువాత వింబుల్డన్ నెగ్గిన మూడో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌లో జకోవిచ్‌ను ఓడించిన రెండో అతిపిన్న వయస్కుడు కూడా ఇతనే. భవిష్యత్తులో టెన్నిస్ సూపర్ స్టార్‌గా అల్కరాస్ ఎదుగుతాడంటూ టెన్నిస్ దిగ్గజాలు కితాబిస్తున్నారు. మరి ఈ యువ సంచలనంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
A lifelong dream! 🏆💚 You always have to believe! I’m only 20 years old, everything is happening too fast, but I’m very proud of how we work every day. Thank you everyone for your support, from the bottom of my heart! 🙌🏻😍 @Wimbledon
📸 Getty pic.twitter.com/MsdjFqBhiO
— Carlos Alcaraz (@carlosalcaraz) July 16, 2023
ఇదీ చదవండి: తండ్రికి ఫోన్ చేసి కన్నీటిపర్యంతమైన జైస్వాల్