iDreamPost
android-app
ios-app

క్రికెట్ లో ఇలాంటి విజయం ఎప్పుడూ చూసుండరు!

  • Author Soma Sekhar Published - 06:34 PM, Fri - 24 November 23

తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఇప్పటి వరకు మీరు చూడని విజయం నమోదు అయ్యింది. అవును క్రికెట్ చరిత్రలో ఇలాంటి గెలుపును ఎవ్వరూ చూసుండరు. గల్లీ క్రికెట్ ను తలపించిన ఈ మ్యాచ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఇప్పటి వరకు మీరు చూడని విజయం నమోదు అయ్యింది. అవును క్రికెట్ చరిత్రలో ఇలాంటి గెలుపును ఎవ్వరూ చూసుండరు. గల్లీ క్రికెట్ ను తలపించిన ఈ మ్యాచ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Author Soma Sekhar Published - 06:34 PM, Fri - 24 November 23
క్రికెట్ లో ఇలాంటి విజయం ఎప్పుడూ చూసుండరు!

ప్రపంచ క్రీడా రంగంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాకర్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న ఆటేదైనా ఉందంటే? అది ఒక్క క్రికెటనే చెప్పాలి. మరి ఇలాంటి జెంటిల్మెన్ గేమ్ లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వివాదాలకు సంబంధించినవి అయితే.. మరికొన్ని సరదా సన్నివేశాలు. తాజాగా జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్ లో ఇప్పటి వరకు మీరు చూడని విజయం నమోదు అయ్యింది. అవును క్రికెట్ చరిత్రలో ఇలాంటి గెలుపును ఎవ్వరూ చూసుండరు. గల్లీ క్రికెట్ ను తలపించిన ఈ మ్యాచ్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

క్రికెట్ మ్యాచ్ ల్లో సాధారణంగా వర్షం పడి మ్యాచ్ రద్దు కావడమో.. లేదా వెలుతురు సరిగ్గా లేని కారణంగా మ్యాచ్ ఆపేయడమో జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మనం క్రికెట్ చరిత్రలో చాలానే చూశాం. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా విజయం నమోదు అయ్యింది. కంబోడియా-ఇండోనేషియా జట్ల మధ్య 7 టీ20 మ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ నడుస్తోంది. అందులో భాగంగా నిన్న (నవంబర్ 23న) 6వ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండోనేషియా టీమ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన కంబోడియా టీమ్ 11.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇలా మ్యాచ్ ఆగిపోవడానికి కారణం తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు.

ఈ మ్యాచ్ లో కంబోడియా బ్యాటర్ లక్మన్ భట్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే ఈ క్యాచ్ వివాదాస్పదం కావడంతో.. సదరు టీమ్ మ్యాచ్ ను కొనసాగించేందుకు ఇష్టపడలేదు. దీంతో గ్రౌండ్ ను వాకౌట్ చేసేందుకు సిద్దపడింది. ఈ సమయంలో అంపైర్లు కంబోడియా ఆటగాళ్లను ఎంత కన్విన్స్ చేసినా.. వారు కన్విన్స్ కాలేదు. దీంతో చేసేదేమీ లేక అంపైర్లు ఇండోనేషియా గెలిచినట్లుగా ప్రకటించారు. ఈ ఫలితం వరల్డ్ క్రికెట్ హిస్టరీలోనే ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ఇక ఈ విజయంతో ఇండోనేషియా 4-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కాగా.. ఇలాంటి సంఘటనలు గల్లీ క్రికెట్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మరి విచిత్ర విజయంతో వార్తల్లో నిలిచిన ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.