iDreamPost
android-app
ios-app

బుమ్రా రిటైర్మెంట్ తీసుకోవాలంటున్న దిగ్గజ బౌలర్.. లేకపోతే చాలా కష్టమంటూ..!

  • Author singhj Published - 09:38 AM, Sat - 5 August 23
  • Author singhj Published - 09:38 AM, Sat - 5 August 23
బుమ్రా రిటైర్మెంట్ తీసుకోవాలంటున్న దిగ్గజ బౌలర్.. లేకపోతే చాలా కష్టమంటూ..!

జస్​ప్రీత్ బుమ్రా.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ పేసర్ అనతి కాలంలోనే భారత జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్​లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ వెలుగులోకి వచ్చాడు బుమ్రా. ఐపీఎల్​లో అద్భుతమైన ప్రదర్శనతో భారత జట్టులో చోటు సంపాదించాడు. కచ్చితమైన పేస్​తో యార్కర్లు, స్వింగింగ్ డెలివరీస్​ను సంధిస్తూ ప్రపంచ మేటి బ్యాటర్లను వణికించాడు. క్రమంగా టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ఆడుతూ.. వరల్డ్ టాప్ బౌలర్లలో ఒకడిగా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే గాయాలు బుమ్రా కెరీర్​ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.

తక్కువ రనప్​తో భిన్నమైన శైలితో బౌలింగ్ చేసినా గంటకు 140 కి.మీ.కు తగ్గకుండా బంతులు సంధించడం బుమ్రా ప్రత్యేకత. అయితే ఈ బౌలింగ్ శైలి వల్ల అతడు నిత్యం గాయాలపాలవుతున్నాడు. ప్రస్తుతం ఇంజ్యురీ నుంచి కోలుకున్న భారత పేసుగుర్రం.. త్వరలో జరిగే ఐర్లాండ్ పర్యటనతో పునరాగమనం చేస్తున్నాడు. దాదాపు ఏడాది తర్వాత క్రికెట్ ఫీల్డ్​లోకి దిగనున్న బుమ్రాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్​పై ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్​గ్రాత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బుమ్రా త్వరగా రిటైర్మెంట్ తీసుకోవాలని మెక్​గ్రాత్ సూచించాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్​లో ఎక్కువ కాలం కొనసాగాలంటే ఏదో ఒక ఫార్మాట్​ నుంచి బుమ్రా తప్పుకుంటే మంచిదని మెక్​గ్రాత్ అభిప్రాయపడ్డాడు. అతడి బౌలింగ్​కు తాను పెద్ద అభిమానినని.. అయితే బౌలింగ్ శైలి భిన్నంగా ఉండటంతోనే శరీరంపై అధిక భారం పడుతోందన్నాడు. ఈ సమస్యను అధిగమించాలంటే బుమ్రా మరింత బలంగా తయారవ్వడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు మెక్​గ్రాత్. ప్రస్తుతం క్రికెటర్లు విశ్రాంతి లేని క్రికెట్ ఆడుతూ అలసిపోతున్నారని.. కాబట్టి ఇంజ్యురీలు అవ్వడం సాధారణమేనని ఆయన చెప్పుకొచ్చాడు. బుమ్రా దీన్ని దృష్టిలో ఉంచుకొని.. టీమిండియాకు ఎక్కువ కాలం ఆడాలంటే ఏదో ఒక ఫార్మాట్​కు గుడ్ బై చెప్పాలని మెక్​గ్రాత్ పేర్కొన్నాడు.