iDreamPost

వీడియో: అన్​బిలీవబుల్ క్యాచ్.. బ్యాటరే కాదు.. టీమ్​మేట్స్ కూడా నమ్మలేదు!

  • Published Jan 25, 2024 | 9:39 AMUpdated Jan 25, 2024 | 9:39 AM

క్రికెట్​లో ఎన్నో బెస్ట్ క్యాచులను చూసుంటాం. ఈ క్యాచ్ కూడా కచ్చితంగా ఆ కోవలోకే వస్తుంది. ఫీల్డర్ పట్టిన క్యాచ్​ను చూసి బ్యాట్స్​మన్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు.

క్రికెట్​లో ఎన్నో బెస్ట్ క్యాచులను చూసుంటాం. ఈ క్యాచ్ కూడా కచ్చితంగా ఆ కోవలోకే వస్తుంది. ఫీల్డర్ పట్టిన క్యాచ్​ను చూసి బ్యాట్స్​మన్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు.

  • Published Jan 25, 2024 | 9:39 AMUpdated Jan 25, 2024 | 9:39 AM
వీడియో: అన్​బిలీవబుల్ క్యాచ్.. బ్యాటరే కాదు.. టీమ్​మేట్స్ కూడా నమ్మలేదు!

క్రికెట్​లో ఫీల్డింగ్​కు ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. కీలక సమయంలో పట్టే ఒక్క క్యాచ్​తో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోతుంది. ఒక మంచి బ్యాటర్ రనౌట్ అయితే టీమ్ మొత్తం కుప్పకూలిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే క్యాచెస్ విన్ మ్యాచెస్ అని అంటుంటారు. గ్రౌండ్ ఫీల్డింగ్​లో పరుగులు లీక్ కాకుండా చూసుకోవడం, క్యాచులు పట్టడం వల్ల అదనంగా మరికొన్ని రన్స్ చేసినట్లే. దీని వల్ల బౌలర్లు మరింత స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలుగుతారు. అందుకే అన్ని జట్లు కూడా ఫీల్డింగ్​ను మెరుగుపరుచుకోవడం మీద ఫోకస్ పెడుతున్నాయి. ఇక, బెస్ట్ క్యాచెస్, రనౌట్స్​కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవడం చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో వ్యూస్ కూడా భారీగా వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ క్యాచింగ్ వీడియోనే బాగా వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్​బాష్ లీగ్​-2024 ఫైనల్​లో ఓ క్యాచ్ అందర్నీ షాక్​కు గురిచేసింది. బ్రిస్బేన్ హీట్ పేసర్ జేవియర్ బార్ట్లెట్ వేసిన బాల్​ను సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ స్ట్రయిట్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించాడు. ఆ బాల్ చాలా పైకి లేచింది. అయితే పరిగెత్తుకుంటూ వచ్చిన మైకేల్ నేసర్ బౌండరీ లైన్ దగ్గర దాన్ని అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ తప్పి కిందపడ్డాడు. అయితే అక్కడే బౌండరీ లైన్ ఉండటంతో గాల్లో ఎగిరి లైన్ లోపల ఉన్న పాల్ వాల్టర్ అనే మరో ఫీల్డర్ వైపు విసిరాడు. బంతిని అందుకున్న వాల్టర్ క్యాచ్ అంటూ అప్పీల్ చేశాడు. దీన్ని షాట్ కొట్టిన బ్యాటర్​తో పాటు సొంత టీమ్​మేట్స్ కూడా నమ్మలేదు. అది క్యాచ్ కాదని.. బంతిని విసరండి అంటూ అరుస్తూ కనిపించారు. కానీ రీప్లేలో బాల్​ను స్పష్టంగా లోపలకు విసిరి క్యాచ్ అందుకున్నట్లు తేలింది. దీంతో బ్రిస్బేన్ హీట్ ప్లేయర్లు సెలబ్రేషన్స్​లో మునిగిపోయారు. ఈ నమ్మశక్యం కాని క్యాచ్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మైకేల్ నేసర్ అందుకున్న క్యాచ్, అతడి ఎఫర్ట్​ను సోషల్ మీడియాలో నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. నేసర్ ప్రెజెన్స్ ఆఫ్​ మైండ్ సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు. క్యాచ్ నేసర్ ఖాతాలో రాకపోయినా అద్భుతంగా ఒడిసి పట్టుకొని లోపలకు విసిరిన అతడికి​ ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలని కామెంట్స్ చేస్తున్నారు. అసలు అలా ఎలా క్యాచ్​ పట్టావని అడుగుతున్నారు. ఇలాంటి ఫీల్డర్లు ఉంటే ఓడిపోయే మ్యాచుల్లో కూడా గెలవొచ్చని చెబుతున్నారు. ఇక, ఈసారి బిగ్​బాష్ లీగ్ విన్నర్​గా బ్రిస్బేన్ హీట్ జట్టు అవతరించింది. ఫైనల్లో మొదట బ్యాటింగ్​కు దిగిన బ్రిస్బేన్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మోస్తరు టార్గెట్​ను ఛేజ్ చేయడంలో సిడ్నీ సిక్సర్స్ ఫెయిలైంది. ఆ టీమ్ 17.3 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. పేసర్ స్పెన్సర్ జాన్సన్ 4 వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. మరి.. మైకేల్ నేసర్ అందుకున్న అన్​బిలీవబుల్ క్యాచ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి