iDreamPost
android-app
ios-app

నా 400 రికార్డ్ స్కోర్ ను ఆ టీమిండియా ప్లేయర్ ఒక్కరోజులో బద్దలు కొడతాడు: బ్రియన్ లారా

  • Published Apr 30, 2024 | 3:50 PM Updated Updated Apr 30, 2024 | 3:50 PM

తన ఆల్ టైమ్ రికార్డ్ ను ఒక్క రోజులో కొట్టే మెునగాడు ఆ టీమిండియా ప్లేయరే అంటూ కితాబిచ్చాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. మరి ఆ భారత ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

తన ఆల్ టైమ్ రికార్డ్ ను ఒక్క రోజులో కొట్టే మెునగాడు ఆ టీమిండియా ప్లేయరే అంటూ కితాబిచ్చాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. మరి ఆ భారత ప్లేయర్ ఎవరు? తెలుసుకుందాం పదండి.

నా 400 రికార్డ్ స్కోర్ ను ఆ టీమిండియా ప్లేయర్ ఒక్కరోజులో బద్దలు కొడతాడు: బ్రియన్ లారా

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. కొన్నింటిని బద్దలు కొడుతూ.. దూసుకొస్తున్నారు యంగ్ ప్లేయర్లు. కానీ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా కొన్ని రికార్డులు ఉన్నాయి. అందులో ఒకటి వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల రికార్డు. ఈ రికార్డ్ ను ఇప్పటి వరకు ఏ దిగ్గజ బ్యాటర్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు. అయితే గతంలో తన రికార్డ్ ను బద్దలు కొట్టేది వాళ్లేనని లారా స్టేట్మెంట్ సైతం ఇచ్చాడు. కానీ తాజాగా తన ఆల్ టైమ్ రికార్డ్ ను ఒక్క రోజులో కొట్టే మెునగాడు ఆ టీమిండియా ప్లేయరే అంటూ కితాబిచ్చాడు. మరి ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు?

బ్రియన్ లారా.. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ గా ఆ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఇక తన కెరీర్ లో సాధించిన 400 పరుగుల ఆల్ టైమ్ రికార్డ్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నప్పటికీ.. లారా రికార్డ్ ను టచ్ చేయలేకపోయారు. అయితే తన గ్రేటెస్ట్ రికార్డ్ ను ఒక్కరోజులో బద్దలు కొట్టే సత్తా ఉన్న ప్లేయర్ ఒక్క రోహిత్ శర్మే అంటూ చెప్పుకొచ్చాడు. నేడు(ఏప్రిల్ 30) రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

“నా 400 పరుగుల రికార్డ్ ను రోహిత్ శర్మ ఒక్కడే ఒక్క రోజులో లేదా రోజున్నరలో బద్దలు కొట్టగలడు. ఆ సత్తా అతడిలో ఉంది. మరికొన్ని సంవత్సరాలు అతడు క్రికెట్ ఆడగలడు. స్టార్ క్రికెటర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ విషెస్ తెలిపాడు లారా. కాగా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను తొలగించిన తర్వాత అసంతృప్తికి గురైయ్యాడు. దాంతో పాటుగా బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ సీజన్ లో ఒక సెంచరీ చేసినప్పటికీ.. మిగతా మ్యాచ్ ల్లో భారీ స్కోర్లు చేయడంలో విఫలం అవుతున్నాడు. మరి రోహిత్ పై లారా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.