iDreamPost

అఫ్గాన్ సెమీస్ చేరుతుందని ముందే చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్గానిస్తాన్ టీమ్ సెమీ ఫైనల్ కు చేరుతుందని ఒకే ఒక్క దిగ్గజ క్రికెటర్ చెప్పాడు. మిగతా లెజెండ్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆఫ్గాన్ సెమీస్ చేరుతుందని చెప్పిన ఆ దిగ్గజం ఎవరంటే?

టీ20 వరల్డ్ కప్ 2024లో ఆఫ్గానిస్తాన్ టీమ్ సెమీ ఫైనల్ కు చేరుతుందని ఒకే ఒక్క దిగ్గజ క్రికెటర్ చెప్పాడు. మిగతా లెజెండ్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆఫ్గాన్ సెమీస్ చేరుతుందని చెప్పిన ఆ దిగ్గజం ఎవరంటే?

అఫ్గాన్ సెమీస్ చేరుతుందని ముందే చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఎవరో తెలుసా?

టీ20 వరల్డ్ కప్ 2024 ముగింపు దశకు చేరుకుంది. గ్రూప్ 1 నుంచి భారత్, ఆఫ్గానిస్తాన్ జట్లు సెమీస్ కు చేరగా.. గ్రూప్ 2 నుంచి ఇంగ్లండ్, సౌతాఫ్రికా టీమ్స్ సెమీస్ బెర్త్ లు కన్ఫమ్ చేసుకున్నాయి. అయితే టోర్నీ ఆరంభానికి ముందు చాలా మంది లెజెండ్స్ సెమీస్, ఫైనల్ కు చేరే జట్లు ఇవే అంటూ తమ ప్రిడిక్షన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఒకే ఒక్క దిగ్గజ క్రికెటర్  ఆఫ్గానిస్తాన్ సెమీస్ చేరుతుందని చెప్పాడు. ఆ లెజెండ్ ఎవరంటే?

ప్రస్తుతం జరుగుతున్న పొట్టి ప్రపంచ కప్ లో ఆఫ్గానిస్తాన్ దూసుకెళ్తోంది. హేమాహేమీ జట్లను తలదన్ని సెమీస్ కు దూసుకొచ్చింది. బంగ్లాదేశ్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో 8 వికెట్లతో విజయం సాధించి.. ఆస్ట్రేలియాను ఇంటికి పంపించింది. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు చాలా మంది దిగ్గజ క్రికెటర్లు పలానా జట్లు సెమీస్ కు చేరుతాయని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే చాలా మంది ఇండియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్స్ సెమీస్ చేరుతాయని చెప్పుకొచ్చారు. కానీ ఓకే ఒక్క దిగ్గజ క్రికెటర్ మాత్రం ఆఫ్గానిస్తాన్ కూడా సెమీస్ చేరుతుందని చెప్పుకొచ్చాడు. అతడే వెస్టిండీస్ లెజెండ్.. బ్రియన్ లారా.

వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా వరల్డ్ కప్ కు ముందు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ గా ఉన్న దిగ్గజాల అంచనాలను తలకిందులు చేస్తూ.. ఆఫ్గానిస్తాన్ సెమీస్ కు చేరుతుందని చెప్పుకొచ్చాడు బ్రియన్ లారా. ఆప్గాన్ తో పాటుగా వెస్టిండీస్, ఇండియా, ఇంగ్లండ్ లు సెమీస్ చేరుతాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆఫ్గానిస్తాన్ పై నమ్మకముంచి.. ఆ జట్టు సెమీస్ కు చేరుతుందని బల్లగుద్ది మరీ చెప్పాడు లారా. మరి ఆఫ్గాన్ సెమీస్ కు చేరుతుందని చెప్పిన లారా నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి