Somesekhar
Mayank Yadav-Brett Lee: ఆసీస్ లెజెండ్, మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం మయాంక్ బౌలింగ్ కు మంత్ర ముగ్దుడు అయ్యాడు. అయితే ఆ ఒక్క తప్పు చేయకపోతే.. మయాంక్ 160 స్పీడ్ తో బంతులు వేడగలడని బ్రెట్ లీ సూచించాడు. మరి మయాంక్ చేస్తున్న తప్పేంటి? బ్రెట్ లీ ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
Mayank Yadav-Brett Lee: ఆసీస్ లెజెండ్, మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం మయాంక్ బౌలింగ్ కు మంత్ర ముగ్దుడు అయ్యాడు. అయితే ఆ ఒక్క తప్పు చేయకపోతే.. మయాంక్ 160 స్పీడ్ తో బంతులు వేడగలడని బ్రెట్ లీ సూచించాడు. మరి మయాంక్ చేస్తున్న తప్పేంటి? బ్రెట్ లీ ఇచ్చిన అడ్వైజ్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
Somesekhar
మయాంక్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. బుల్లెట్ వేగంతో బంతులు సంధిస్తూ.. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు ఈ యువ పేసర్. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో కంటిన్యూస్ గా బంతులు విసురుతూ.. చెలరేగిపోతున్నాడు మయాంక్. ఇక ఇతడి స్పీడ్ పై వరల్డ్ వైడ్ గా ఉన్న దిగ్గజాలు షాక్ కు గురౌతున్నారు. తాజాగా ఆసీస్ లెజెండ్, మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం మయాంక్ బౌలింగ్ కు మంత్ర ముగ్దుడు అయ్యాడు. అయితే ఆ ఒక్క తప్పు చేయకపోతే.. మయాంక్ 160 స్పీడ్ తో బంతులు వేడగలడని బ్రెట్ లీ సూచించాడు. మరి ఈ కుర్ర బౌలర్ చేస్తున్న తప్పేంటి?
మయాంక్ యాదవ్ ఐపీఎల్ లో ఇప్పటికి ఆడింది కేవలం రెండు మ్యాచ్ లే. కానీ ఓ స్టార్ ప్లేయర్ రేంజ్ కి ఎదిగిపోయాడు. ఈ రెండు మ్యాచ్ ల్లో 5.12 ఎకానమీతో 6 వికెట్లు సాధించాడు. దాంతో పాటుగా తొలి రెండు మ్యాచ్ ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన తొలి క్రికెటర్ గా ఐపీఎల్ లో రికార్డు సృష్టించాడు. ఇక అతడి వేగానికి ప్రపంచ క్రికెట్ సంభ్రమాశ్చర్యాలకు గురైంది. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో కంటిన్యూస్ గా బాల్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది మయాంక్ యాదవ్ అలవోకగా బంతులను బుల్లెట్ వేగంతో సంధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మయాంక్ స్పీడ్ పై ఆసీస్ మాజీ దిగ్గజ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు.
ఓ షోలో మయాంక్ స్పీడ్ పై బ్రెట్ లీ స్పందిస్తూ..”మయాంక్ బౌలింగ్ అద్భుతం. అతడి స్పీడ్ అమోఘం. అయితే అతడు మరింత పేస్ ను కలిగి ఉన్నాడు. ఈ సందర్భంగా నేను మయాంక్ కు ఓ సలహా ఇవ్వదలచుకున్నాను. అతడి బౌలింగ్ యాక్షన్ లో కొద్దిగా మార్పులు చేస్తే.. గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ తో వేయగలడు. మయాంక్ బాల్ విసిరే ముందు తన తలను స్ట్రైట్ గా ఉంచితే.. మరింత పేస్ వస్తుంది. దీంతో బౌలింగ్ లో వేగం పెరుగుతుంది. ఇది ఫాలో అయితే చాలు” అంటూ సలహా ఇచ్చాడు. మరి మయాంక్ తన వేగంతో ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడతాడో చూద్దాం మరి.
ఇదికూడా చదవండి: IPL 2024: RCB గెలవాలంటే కోహ్లీ అది కచ్చితంగా చేయాలి.. ఏబీడీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!