Somesekhar
ఇండియాతో జరుగుతున్న సిరీస్ లో ఓటమిపై తాజాగా స్పందించాడు ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. ఓడిపోయాం అని ఒప్పుకుంటూనే కొండకు లెక్కలేసే మాటలు మాట్లాడాడు.
ఇండియాతో జరుగుతున్న సిరీస్ లో ఓటమిపై తాజాగా స్పందించాడు ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. ఓడిపోయాం అని ఒప్పుకుంటూనే కొండకు లెక్కలేసే మాటలు మాట్లాడాడు.
Somesekhar
బజ్ బాల్.. టెస్ట్ క్రికెట్ కు సరికొత్త నిర్వచనం ఇస్తామంటూ ఇంగ్లండ్ టీమ్ గొప్పలు చెప్పుకుంది. అయితే ఈ బజ్ బాల్ స్ట్రాటజీ పాకిస్తాన్, ఆసీస్ జట్లపై పారింది కానీ.. టీమిండియాపై మాత్రం బెడిసికొట్టింది. ఆ విషయం ఈ సిరీస్ లో అందరికి తెలిసిందే. అసలు సిసలు బజ్ బాల్ ను ఇంగ్లండ్ కు చూపించాడు టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్. ఇక ఈ సిరీస్ లో ఓటమిపై తాజాగా స్పందించాడు ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్. ఓడిపోయాం అని ఒప్పుకుంటూనే కొండకు లెక్కలేసే మాటలు మాట్లాడాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 3-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ లో ఓటమి అనంతరం గొప్పగా పుంజుకున్న భారత్.. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించి.. అద్భుతం చేసింది. బజ్ బాల్ స్ట్రాటజీ అంటూ విర్రవీగిన బ్రిటీష్ టీమ్ నోరుమూసుకుంది. కాగా.. తాజాగా ఈ సిరీస్ ఓటమిపై స్పందించాడు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్.
బ్రెండన్ మెక్ కల్లమ్ మాట్లాడుతూ..”మా జట్టు ఈ సిరీస్ తో పాటుగా యాషెస్ సిరీస్ ను కూడా కోల్పోయింది. కానీ మేము బెటర్ టీమే. 18 నెలల క్రితం మా ఆటతీరు కంటే ఇప్పుడు చాలా మెరుగుపడ్డాం. అదీకాక రాబోయే 18 నెలల్లో ఓ అద్బుతాన్ని చేసి చూపించడానికి రెడీగా ఉన్నాం. నిజం చెప్పాలంటే నేను ఆ అద్భుతం కోసం తహతహలాడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మెక్ కల్లమ్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025ను తాము గెలుచుకుంటామని ఇన్ డైరెక్ట్ గా ధీమా వ్యక్తం చేశాడు. దీంతో టీమిండియా, క్రికెట్ ఫ్యాన్స్ అతడిపై సెటైర్లు వేస్తున్నారు. కొండకు నిచ్చెన వేసే మాటలు మాట్లాడకు. అసలు మీరు ఫైనల్ వరకు వెళ్తారా? ఒకవేళ వెళ్లినా.. గెలుస్తారా? అంటూ విమర్శిస్తున్నారు. మరి బ్రెండన్ మెక్ కల్లమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Brendon McCullum speaks pic.twitter.com/TtRsfzEX6x
— RVCJ Media (@RVCJ_FB) February 28, 2024
ఇదికూడా చదవండి: కోచ్ తో రోహిత్ ఛాలెంజ్! చెప్పింది చేసి చూపించిన మొనగాడు!