iDreamPost
android-app
ios-app

SA vs AFG: ఆఫ్గానిస్తాన్ ను ఓడిస్తే.. వరల్డ్ కప్ సౌతాఫ్రికాదే! ఆసీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

  • Published Jun 26, 2024 | 8:08 AM Updated Updated Jun 26, 2024 | 8:08 AM

ఆఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ లెజెండ్ ఒకరు. సెమీస్ లో ఆఫ్గాన్ ఓడిస్తే.. వరల్డ్ కప్ సౌతాఫ్రికాదే అని జోస్యం చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ లెజెండ్ ఒకరు. సెమీస్ లో ఆఫ్గాన్ ఓడిస్తే.. వరల్డ్ కప్ సౌతాఫ్రికాదే అని జోస్యం చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..

SA vs AFG: ఆఫ్గానిస్తాన్ ను ఓడిస్తే.. వరల్డ్ కప్ సౌతాఫ్రికాదే! ఆసీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. ఈ మెగాటోర్నీలో మరో మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, సౌతాఫ్రికా వర్సెస్ ఆఫ్గానిస్తాన్ ల మధ్య కీలకమైన పోరు జరగనుంది. ఇక ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన ప్రోటీస్ జట్టు.. ఎలాగైనా కప్ ను అందుకోవాలని  ఉవ్విళ్లూరుతోంది.  గతంలో చేసిన తప్పులు చేయకుండా టైటిల్ ను ఎగరేసుకుపోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఆసీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సెమీ ఫైనల్లో ఆఫ్గానిస్తాన్ ను ఓడిస్తే.. కప్ సౌతాఫ్రికాదే అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి.. ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. ఇక 2009, 2014లో కూడా సెమీస్ చేరిన సఫారీ టీమ్.. ఆ గండాన్ని మాత్రం దాటలేకపోయింది. ఎప్పుడూ సెమీస్ లోనే ఇంటిదారి పడుతూ వరల్డ్ క్రికెట్ లో ‘చోకర్స్’ నిలిచే దక్షిణాఫ్రికా  ఈసారి ఎలాగైనా ఆ అపవాదు పోగొట్టుకొని.. కప్ కొట్టాలని భావిస్తోంది. సెమీస్ లో చిచ్చర పిడుగు ఆఫ్గాన్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ క్రమంలో ఆసీస్ లెజెండ్, మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బ్రాడ్ హగ్ మాట్లాడుతూ..”ఈ టోర్నీ ప్రారంభం నుంచి సౌతాఫ్రికా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ వస్తోంది. ప్రోటీస్ ఆటగాళ్లలో హెండ్రిక్స్, క్లాసెన్ తో పాటుగా వారి స్పిన్ దళం గొప్పగా రాణిస్తోంది. ఆఫ్గాన్ తో మ్యాచ్ లో హెండ్రిక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడి, తన జట్టును ఫైనల్ కు చేరుస్తాడనుకుంటున్నాను. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ లో అదరగొడుతున్నాడు. సెమీస్ లో గనక ఆఫ్గానిస్తాన్ ను ఓడిస్తే.. వరల్డ్ కప్ సౌతాఫ్రికాదే” అంటూ జోస్యం చెప్పుకొచ్చాడు ఆసీస్ మాజీ క్రికెటర్. కాగా.. జూన్ 27న రెండు సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మరి బ్రాడ్ హగ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.