Nidhan
ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈసారి టీమిండియాకు ఓటమి తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతడు ఆ పీడకలను మర్చిపోయాడేమోనని మెన్ ఇన్ బ్లూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ భారత్‌కు హెచ్చరికలు జారీ చేశాడు. ఈసారి టీమిండియాకు ఓటమి తప్పదంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే అతడు ఆ పీడకలను మర్చిపోయాడేమోనని మెన్ ఇన్ బ్లూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
Nidhan
ప్రస్తుత క్రికెట్లో టాప్ టీమ్ ఏదంటే.. వెంటనే టీమిండియా, ఆస్ట్రేలియానే గుర్తుకొస్తాయి. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో కంగారూలు ఛాంపియన్లుగా నిలిచారు. ఈ సంవత్సరం జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఏ బడా ఐసీసీ టోర్నమెంట్‌ను చూసుకున్నా ఈ రెండు జట్లే ఎక్కువగా ఫైనల్స్‌లో తలపడుతున్నాయి. వరల్డ్ కప్స్‌తో పాటు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌లోనూ ఇదే జరిగింది. భారత్-ఆసీస్ తలపడుతున్నాయంటే చూడటానికి క్రికెట్ లవర్స్ అంతా టీవీలు, ఫోన్లకు అతుక్కుపోతారు. రెండూ బలమైన జట్లు కావడం, టీమ్స్ నిండా స్టార్లు ఉండటం, బిగ్ మ్యాచెస్ ప్లేయర్స్ ఉండటంతో ఈ జట్లు తలపడే సిరీస్‌లకు భారీ స్థాయిలో ఆదరణ దక్కుతుంది.
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ప్రత్యేకత ఉంది. ఈ ట్రోఫీ కోసం ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటుంటాయి. అయితే ఒకప్పుడు ఈ సిరీస్‌లో కంగారూల ఆధిపత్యం నడిచినా.. ఈ మధ్య కాలంలో టీమిండియా డామినేషన్ నడుస్తోంది. గత 8 ఏళ్లలో నాలుగు సార్లు బీజీటీ సిరీస్ జరగగా.. అన్నింటా భారతే విజేతగా నిలిచింది. 2018-19, 2020-21లో వాళ్ల ఇంటికెళ్లి మరీ ఆసీస్‌ను చిత్తు చేసి వచ్చింది టీమిండియా. ఈ ఏడాది ఆఖర్లో మరోమారు కంగారూ నేల పైకి రోహిత్ సేన అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ దిగ్గజం రికీ పాంటింగ్ రియాక్ట్ అయ్యాడు. ఈసారి భారత్‌ను చిత్తుగా ఓడించి పంపుతామని అన్నాడు. 3-1 తేడాతో మెన్ ఇన్ బ్లూను మట్టికరిపిస్తామని ఛాలెంజ్ చేశాడు.
‘ఈసారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చాలా రసవత్తరంగా సాగుతుందని అనిపిస్తోంది. అయితే గత రెండు సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై భారత్‌తో మరోమారు తలపడనుంది మా జట్టు. కాబట్టి ఈసారి ఆ టీమ్‌ను వదిలిపెట్టొద్దు. ఈసారి మ్యాచ్‌లు డ్రా కాకుండా చూసుకోవాలి. నేను నా దేశానికి మద్దుతు ఇస్తా. డ్రా అవ్వడం లేదా వాతావరణ పరిస్థితుల వల్ల ఒక మ్యాచ్‌లో ఫలితం రాకపోవచ్చు. అయితే మిగిలిన టెస్టుల్లో మాత్రం ఆసీసే గెలుస్తుంది. భారత్‌ను 3-1తో ఓడించడం ఖాయం’ అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అంత ఓవరాక్షన్ వద్దని అంటున్నారు. గత రెండు పర్యటనల్లో కంగారూలను టీమిండియా చిత్తు చిత్తుగా ఓడించడం మర్చిపోయావా? అని ప్రశ్నిస్తున్నారు. గబ్బా టెస్ట్ రిజల్ట్ తెలుసు కదా? ఆ పీడకలను గుర్తుచేసుకో అంటూ టీజ్ చేస్తున్నారు. ఇంకోసారి మీకు చావుదెబ్బ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. మరి.. బీజీటీ 2024-25లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.