iDreamPost
android-app
ios-app

యాషెస్‌లో మరో వివాదం! బెన్‌ స్టోక్స్‌ పట్టిన క్యాచ్‌ కరెక్టేనా?

  • Published Aug 01, 2023 | 8:19 AM Updated Updated Aug 01, 2023 | 8:19 AM
  • Published Aug 01, 2023 | 8:19 AMUpdated Aug 01, 2023 | 8:19 AM
యాషెస్‌లో మరో వివాదం! బెన్‌ స్టోక్స్‌ పట్టిన క్యాచ్‌ కరెక్టేనా?

బెయిర్‌ స్టో రనౌట్‌, స్టీవ్‌ స్మిత్‌ రనౌట్‌ వివాదాలతో అట్టుడికిన యాషెస్‌ సిరీస్‌లో తాజాగా మరో వివాదం రాజుకుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ మధ్య హోరాహోరీగా సాగిన చివరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. దీంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. అయితే.. ఐదో టెస్టు చివరి రోజు బెన్‌ స్టోక్స్‌ అందుకున్న ఓ క్యాచ్‌ తీవ్ర వివాదానికి దారి తీసింది. అది అవుట్‌ కొంతమంది, నాటౌట్‌ అని మరికొంతమంది సోషల్‌ మీడియా వేదికగా వాదించుకుంటున్నారు. క్రికెట్‌ వర్గాల్లో సైతం ఈ క్యాచ్‌పై తీవ్ర చర్చ జరుగుతోంది. అది అవుటా? నాటౌటా? అనే దానిపై సర్వత్రా వివాదం నెలకొని ఉంది.

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ వేసిన ఇన్నింగ్స్‌ 66వ ఓవర్‌ తొలి బంతిని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అది కాస్త అతని గ్లౌజ్‌కు తగిలి గాల్లోకి లేచింది. లెగ్‌ గల్లీలో ఫీల్డింగ్‌ చేస్తున్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ గాల్లోకి అమాంతం ఎగిరి దాన్ని అందుకున్నాడు. క్యాచ్‌ అందుకున్న సంతోషంలో సంబురాలు చేసుకుంటున్న క్రమంలో బాల్‌ చేతుల్లోంచి జారి పడిపోయింది. దీంతో బెన్‌ ఆ క్యాచ్‌పై కాన్ఫిడెంట్‌గా చెప్పలేక.. రివ్యూ తీసుకున్నాడు.

రివ్యూలో థర్డ్‌ అంపైర్‌ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే.. కొన్ని సెకన్ల పాటు బంతి బెన్‌ స్టోక్స్‌ చేతుల్లోనే ఉంది. అయినా దాన్ని అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడంపై ఇంగ్లండ్‌ క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెన్‌ చేసిన పొరపాటుతో బతికిపోయిన స్టీవ్‌ స్మిత్‌ లంచ్‌ తర్వాత అవుట్‌ అయ్యాడు. మొత్తానికి చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించి.. సిరీస్‌ను డ్రా చేసుకోగలిగింది. కానీ, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో ఆస్ట్రేలియాకే కప్పు అందించారు. మరి ఈ ఐదో టెస్టులో బెన్‌ స్టోక్స్‌ అందుకున్న క్యాచ్‌కు సంబంధించిన వీడియో కింద ఉంది. దాన్ని చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: యువీ 6 సిక్సుల తర్వాత.. బ్రాడ్‌ భారత్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడని తెలుసా?